Site icon NTV Telugu

MSG- Venky: ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో వెంకటేష్ పాత్ర ఇదే..!

Manashankarvaraprasad Garu

Manashankarvaraprasad Garu

మెగాస్టార్ చిరంజీవి, మాస్ అండ్ కామెడీ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’. పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మరో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కూడా కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా వెంకీ పాత్రకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో హీరోయిన్ నయనతార పాత్ర రెండో పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు, ఆ సంబంధం కోసం వచ్చే హీరోగా వెంకటేష్ కనిపిస్తారట. ఇప్పటికే చిరు, వెంకీల మధ్య మంచి స్నేహం ఉండటం.. ఇది తెలియని నయనతారతో వారిద్దరూ కలిసి చేసే కామెడీ డ్రామా సినిమాకే హైలైట్ అని తెలుస్తోంది.

Also Read : Raja Saab : ‘రాజా సాబ్’ నుంచి ‘నాచే నాచే’ సాంగ్ ప్రోమో రిలీజ్..

ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి మరో కారణం మెగాస్టార్ లుక్. సుమారు 25 ఏళ్ల క్రితం చిరంజీవి ఎంత స్లిమ్‌గా, హ్యాండ్సమ్‌గా ఉండేవారో, ఈ సినిమాలో మళ్ళీ అదే మేకోవర్‌లో కనిపిస్తున్నారట. సాహు గారపాటి, చిరంజీవి కుమార్తె సుస్మిత సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 సంక్రాంతి బరిలో దిగేందుకు సిద్ధమవుతోంది. తన కెరీర్‌లో ఇదొక పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమని, కథ విన్నప్పుడే తనకు బాగా నచ్చిందని చిరంజీవి స్వయంగా చాలా సార్లు తెలపడంతో మెగా ఫ్యాన్స్ ఈ సినిమా కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అనిల్ రావిపూడి మార్క్ కామెడీకి ఈ ఇద్దరు స్టార్ హీరోల టైమింగ్ తోడైతే బాక్సాఫీస్ వద్ద నవ్వుల వర్షం కురవడం ఖాయం.

Exit mobile version