MS Dhoni: ‘7’ నంబర్‌పై ధోనీ షాకింగ్ కామెంట్స్.. దాని వెనుక లాజిక్ ఇదే అంటూ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి జెర్సీ నంబర్ 7తో ప్రత్యేక అనుబంధం ఉంది. తన క్రికెట్ కెరీర్ మొత్తం ఇదే నంబర్‌తో కొనసాగిన ధోనీ.. తాజాగా దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఓ న్యూమరాలజిస్ట్ జెర్సీ నంబర్ మార్చుకోవాలని సూచించినా తాను ఎందుకు అంగీకరించలేదో వివరించారు. 2004లో తొలిసారి భారత జట్టుకు ఎంపికైనప్పుడు ధోనీ తనకు జెర్సీ నంబర్ 7 కావాలని కోరారు. అయితే, ఆ నంబర్ విషయంలో ఆయనకు ఎలాంటి ప్రత్యేక నమ్మకాలు లేవని చెప్పుకొచ్చాడు. అందుబాటులో ఉంటే 7 ఇవ్వాలని అడిగానని, ఒకవేళ వేరే నంబర్ ఇచ్చినా సంతోషంగా స్వీకరించేవాడినని చెప్పారు.
ముంబైలో జరిగిన ‘ది పర్పుల్ కార్పెట్’ కార్యక్రమంలో పాల్గొన్న ధోనీ.. విమాన ప్రయాణంలో తనకు ఎదురైన ఓ ఆసక్తికరమైన అనుభవాన్ని పంచుకున్నారు. ఓ న్యూమరాలజిస్ట్ తనను కలిసి జెర్సీ నంబర్ 7 మార్చుకుంటే అదృష్టం మారుతుందని, మైదానంలో మంచి ఫలితాలు వస్తాయని సూచించినట్లు తెలిపారు. అయితే, ఆ సూచనను ధోనీ సున్నితంగా తిరస్కరించానని అన్నారు. ‘‘ఒకసారి 7 నుంచి 11కి మారమంటారు. మళ్లీ 11 నుంచి 15కి మార్చమంటారు. ఇలా నా తప్పులకు నేనే కారణం కాకుండా నంబర్లను నిందిస్తూ ఉంటానా..? నేను సరిగ్గా ప్రాక్టీస్ చేసి, చేయాల్సిన పనులన్నీ సక్రమంగా చేస్తే.. నాకు ఎలాంటి నంబర్ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు’’ అని అతనితో చెప్పినట్లు వెల్లడించారు.
Also Read
- PM Modi AP Tour: తిరుపతిలో ప్రధాని మోడీ పర్యటన.. మూడు రోజుల పాటు బిజీ షెడ్యూల్, భారీ భద్రతా ఏర్పాట్లు!
- AP Panchayat Elections 2026: రెండో దశ పోలింగ్‌లో ఉద్రిక్తతలు.. నకిలీ బ్యాలెట్ పేపర్లు, రాళ్ల దాడులు!
- MK Stalin: "రాజీపడే ప్రసక్తే లేదు".. రాహుల్ గాంధీ చెన్నై పర్యటనకు ముందు స్టాలిన్ కీలక సందేశం..
- Motorcycle Diaries: రిషబ్ శెట్టి సమర్పించు 'మోటార్ సైకిల్ డైరీస్'..!
తన జెర్సీ నంబర్ 7కు ఇంతటి ప్రత్యేక గుర్తింపు రావడంలో అభిమానుల పాత్ర కూడా ఉందని ధోనీ తెలిపారు. అభిమానులు కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలు ఇలా ఏదో ఒక విధంగా లెక్కలు వేసి చివరకు 7 వచ్చేలా చేసేవారని చెప్పారు. అయితే, తాను మాత్రం ఆ నంబర్ విషయంలో పెద్దగా మూఢనమ్మకాలు పెట్టుకోలేదని స్పష్టం చేశారు. ‘‘మీరు ఏ నంబర్ ఎంచుకున్నా.. కాలక్రమంలో అదే మీ లక్కీ నంబర్‌గా మారుతుంది. మంచి వ్యక్తులు ఒక నంబర్‌తో అనుబంధం ఏర్పరుచుకుంటే.. ఆ నంబర్ ఏదైనా ప్రత్యేకంగా మారుతుంది’’ అని ధోనీ ఆ వేదికపై చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
MS Dhoni: ‘7’ నంబర్‌పై ధోనీ షాకింగ్ కామెంట్స్.. దాని వెనుక లాజిక్ ఇదే అంటూ..!
-
PM Modi AP Tour: తిరుపతిలో ప్రధాని మోడీ పర్యటన.. మూడు రోజుల పాటు బిజీ షెడ్యూల్, భారీ భద్రతా ఏర్పాట్లు!
-
AP Panchayat Elections 2026: రెండో దశ పోలింగ్‌లో ఉద్రిక్తతలు.. నకిలీ బ్యాలెట్ పేపర్లు, రాళ్ల దాడులు!
-
MK Stalin: “రాజీపడే ప్రసక్తే లేదు”.. రాహుల్ గాంధీ చెన్నై పర్యటనకు ముందు స్టాలిన్ కీలక సందేశం..
-
Motorcycle Diaries: రిషబ్ శెట్టి సమర్పించు ‘మోటార్ సైకిల్ డైరీస్’..!
ట్రెండింగ్
-
IND vs NZ: ముగిసిన మూడో రోజు ఆట.. భారీ ఆధిక్యం దిశగా న్యూజిలాండ్..!
-
11,000mAh బ్యాటరీ, 7 అంగుళాల భారీ డిస్ప్లేతో రానున్న Redmi Turbo 6 Max..!
-
Jasprit Bumrah Unwanted Record: 292 బంతుల తర్వాత.. జస్ప్రీత్ బుమ్రా కెరీర్లోనే చెత్త రికార్డు!
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, 50MP పెరిస్కోప్ కెమెరాతో Vivo X500e లాంచ్..!
-
IND vs NZ 2nd Test: రెండో టెస్టులో సిరాజ్‌కు మళ్లీ నిరాశ.. ఆకాష్ దీప్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణకు ఛాన్స్!