NTV Telugu Site icon

Credit Card Fraud: హైటెక్‌ మోసం.. ధోనీ, అభిషేక్‌ బచ్చన్‌ సహా ప్రముఖుల పాన్‌ వివరాలతో..

Dhoni

Dhoni

Credit Card Fraud: సైబర్‌ నేరగాళ్లు రోజురోజుకు కొత్త పంథాలో మోసాలకు తెగబడుతున్నారు. తాజాగా సైబర్‌ నేరగాళ్లు క్రీడా, సినీ ప్రముఖుల వివరాలను కూడా వదలడం లేదు. తాజాగా బాలీవుడ్ నటులు, క్రికెటర్ల పాన్‌ వివరాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న వారి జీఎస్టీ గుర్తింపు నంబర్‌ల నుంచి సేకరించి.. పుణెకు చెందిన ఫిన్‌టెక్ స్టార్టప్ ‘వన్ కార్డ్’ నుండి వారి పేర్లతో క్రెడిట్ కార్డ్‌లను పొందారు. అభిషేక్ బచ్చన్, శిల్పాశెట్టి, మాధురీ దీక్షిత్, ఇమ్రాన్ హష్మీ, మహేంద్ర సింగ్ ధోనీ వంటి ప్రముఖుల పేర్లు, వివరాలను మోసగాళ్లు ఉపయోగించుకున్నారని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) షహద్ర రోహిత్ మీనా తెలిపారు. ఈ విషయంపై దర్యాప్తు జరుగుతోందని.. దానిపై ఇప్పుడే ఏం చెప్పలేమని ఆమె చెప్పారు.

ఈ మోసం గురించి కంపెనీకి ఆలస్యంగా తెలిసింగి. అయితే మోసగాళ్లు ఈ కార్డులలో కొన్నింటిని రూ.21.32 లక్షల విలువైన ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ఉపయోగించారు. వెంటనే అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగి ఐదుగురిని అరెస్ట్ చేశారు.పునీత్, మొహమ్మద్ ఆసిఫ్, సునీల్ కుమార్, పంకజ్ మిషార్, విశ్వ భాస్కర్ శర్మ అనే ఐదుగురు నిందితులు చాలా అసాధారణమైన రీతిలో కంపెనీని మోసం చేయడానికి చాలా సమన్వయంతో వ్యవహరించారని ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి. అరెస్ట్‌ చేసిన అనంతరం వారిని విచారించగా.. తమ ప్రత్యేక కార్యనిర్వహణ విధానాన్ని వెల్లడించారు. వారు గూగుల్‌ నుంచి ప్రముఖుల జీఎస్టీ వివరాలను పొందేవారని తెలిసింది. జీఎస్టీఐన్‌ మొదటి రెండు అంకెలు రాష్ట్ర కోడ్, తదుపరి 10 అంకెలు పాన్‌ అని వారికి బాగా తెలుసని నిందితులలో ఒకరు తెలిపారు.

Read Also: Kidnap Drama: లక్ష రూపాయలను ఎగ్గొట్టడానికి యువకుడు కిడ్నాప్ డ్రామా.. చివరకు..

గూగుల్‌లో సెలబ్రిటీల పుట్టిన తేదీ అందుబాటులో ఉన్నందున.. ఈ రెండింటితో పాన్‌, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేశారు. వీడియో వెరిఫికేషన్ సమయంలో వారి సొంత చిత్రాలను ఉంచడం ద్వారా వారు పాన్ కార్డ్‌లను మోసపూరితంగా పునర్నిర్మించారు. వారి లుక్స్ పాన్/ఆధార్ కార్డ్‌లో అందుబాటులో ఉన్న ఫోటోతో సరిపోలుతున్నాయి. ఉదాహరణకు, అభిషేక్ బచ్చన్ పాన్ కార్డ్‌లో అతని పాన్, పుట్టిన తేదీ ఉంది కానీ నిందితులలో ఒకరి చిత్రం ఉంది. ఇదే తరహాలో తమ ఆధార్ వివరాలను ఫోర్జరీ చేశారు. ఈ సమాచారం అందుకున్న వారు క్రెడిట్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీడియో ధృవీకరణ సమయంలో, వారి ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన ప్రశ్నలు అడిగారు. వారు సిబిల్ నుంచి అటువంటి వివరాలన్నీ పొందారు కాబట్టి వారు సులభంగా సమాధానం ఇచ్చారు.

ఈ సెలబ్రిటీలు మంచి సిబిల్ స్కోర్‌లను కలిగి ఉంటారని, ఇది క్రెడిట్ కార్డ్‌లను పొందే అవకాశాలను మెరుగుపరుస్తుందని వారు తెలుసుకున్నారని సమాచారం. అలాగే ఆన్‌లైన్ వెరిఫికేషన్ సిస్టమ్ అభిషేక్ బచ్చన్‌ను సినిమా స్టార్‌గా గుర్తించలేదని వారికి తెలుసు. కాబట్టి అభిషేక్ బచ్చన్ పాన్ ఆధార్ వివరాలతో నిందితుడు పంకజ్ మిశ్రా చిత్రం కార్డు జారీ చేయడానికి బాగా పనిచేసింది. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. వారు ఇతర బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి క్రెడిట్ కార్డ్‌లను పొందేందుకు ఇదే పద్ధతిని ఉపయోగించారని అనుమానిస్తున్నారు. ఆన్‌లైన్ ధృవీకరణ, క్రెడిట్ కార్డ్‌ల జారీలో లొసుగులను ఉపయోగించుకునే మార్గాలను కనుగొనడానికి వారు చాలా నెలల పాటు ఆన్‌లైన్ పరిశోధన చేశారని పోలీసు వర్గాలు తెలిపాయి.

పుణెకు చెందిన ఎఫ్‌పీఎల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వన్ కార్డ్‌ని జారీ చేస్తుంది. ఈ మోసగాళ్లు తమ పేర్లపై క్రెడిట్ కార్డులు జారీ చేయడానికి పాన్, ఆధార్ నంబర్ వంటి వివరాలను అప్‌లోడ్ చేయడం ద్వారా తమ యాప్ ద్వారా కంపెనీని సంప్రదించారని కంపెనీ ఆరోపించింది. కేసు విచారణ కొనసాగుతోంది.