సైబర్ నేరగాళ్లు రోజురోజుకు కొత్త పంథాలో మోసాలకు తెగబడుతున్నారు. తాజాగా సైబర్ నేరగాళ్లు క్రీడా, సినీ ప్రముఖుల వివరాలను కూడా వదలడం లేదు. తాజాగా బాలీవుడ్ నటులు, క్రికెటర్ల పాన్ వివరాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న వారి జీఎస్టీ గుర్తింపు నంబర్‌ల నుంచి సేకరించి.. పుణెకు చెందిన ఫిన్‌టెక్ స్టార్టప్ 'వన్ కార్డ్' నుండి వారి పేర్లతో క్రెడిట్ కార్డ్‌లను పొందారు.