Mrunal Thakur : హృతిక్ రోషన్‌ను చూసి నా మాజీ ప్రియుడు భయపడ్డాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ మరియు టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి మృణాల్ ఠాకూర్, ఇటీవల తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టింది. తన కెరీర్ ఆరంభంలో ‘సూపర్ 30’ సినిమా షూటింగ్ సమయంలో తన మాజీ ప్రియుడు ఎదుర్కొన్న అభద్రతా భావం (Insecurity) గురించి ఆమె షేర్ చేసుకుంది.
బాలీవుడ్ లో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ హృతిక్ రోషన్ సరసన ‘సూపర్ 30′ చిత్రంలో నటిస్తున్న సమయంలో, నా బాయ్ ఫ్రెండ్ చాలా ఆందోళనకు గురయ్యాడు. హృతిక్ వంటి అందగాళ్లు, ఫిట్‌గా ఉండే వ్యక్తుల మధ్య మృణాల్ షూటింగ్ చేస్తోందని తెలిసి, అతను తనను తాను నిరూపించుకోవాలని ప్రయత్నించాడు. నన్నుఎక్కడ కోల్పోతానో అన్న భయంతో అతను కష్టపడి వర్కవుట్స్ చేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే అతను ఏకంగా 15 నుండి 17 కేజీల బరువు తగ్గి, మంచి కండరాలు పెంచి ఫిట్‌గా తయారయ్యాడు. అయితే, ఈ మార్పు ఎంతో కాలం కొనసాగలేదు. కొన్నాళ్ల తర్వాత అతను అకస్మాత్తుగా వ్యాయామం చేయడం మానేసి, విపరీతంగా తినడం మొదలుపెట్టాడు. దీనివల్ల అతను మళ్ళీ 20 కేజీల బరువు పెరిగాడు. అతని ప్రవర్తనలో వచ్చిన ఈ మార్పును చూసి నేను చాలా ఆశ్చర్యపోయను “ఏమైంది? ఎందుకు ఇలా చేస్తున్నావు?” అని ప్రశ్నించగా.. అతను ఎంతో నిరాశగా సమాధానమిచ్చాడట. “నీ చుట్టూ ఉన్న అందగాళ్లతో పోటీ పడలేక నేను అలసిపోయాను అందుకే వదిలేశాను” అని తన మనసులో మాట చెప్పాడు. అందం మరియు ఫిట్‌నెస్ విషయంలో ఇతరులతో పోల్చుకోవడం ఎంత ఒత్తిడికి గురిచేస్తుందో ఈ ఘటన ద్వారా తెలిసింది’ అని తెలిపింది.
Also Read
- Bandi Bhagirath: పోక్సో కేసులో బండి భగీరథ్‌కు బెయిల్..
- Siddipet District: కసాయి తల్లి.. ప్రియుడితో ఏకాంతానికి అడ్డొచ్చాడని రెండేళ్ల కొడుకును హతమార్చిన వైనం..
- NEET UG 2026 Re-Exam: నాగపూర్ విద్యార్థికి అబుదాబిలో నీట్ రీ-ఎగ్జామ్ సెంటర్.. హాల్ టికెట్ చూసి మైండ్ బ్లాక్!
- Bandla Ganesh: 'పవన్ కళ్యాణ్ స్ఫూర్తితోనే'.. నిరంజన్ కుటుంబానికి బండ్ల గణేష్ ఆర్థిక చేయూత
తాజావార్తలు
-
Bandi Bhagirath: పోక్సో కేసులో బండి భగీరథ్‌కు బెయిల్..
-
Rukmini Vasanth : AIతో మార్ఫింగ్ వీడియోలు.. నటి రుక్మిణి వసంత్ పేరుతో అసభ్యకర ప్రచారం.. ముగ్గురి అరెస్ట్
-
Tata Sierra EV: టాటా సియెర్రా EV టీజర్ విడుదల.. ఫస్ట్ లుక్ అదిరింది.. భారీ బ్యాటరీ, ప్రీమియం ఫీచర్లతో ఎంట్రీ
-
Siddipet District: కసాయి తల్లి.. ప్రియుడితో ఏకాంతానికి అడ్డొచ్చాడని రెండేళ్ల కొడుకును హతమార్చిన వైనం..
-
IPL 2027: రిషభ్ పంత్ రాక.. కేఎల్ రాహుల్ భవిష్యత్తుపై చర్చ!
ట్రెండింగ్
-
Titanoboa: డైనోసార్ల తర్వాత భూమిని ఏలిన ‘టైటానోబోవా’.. ఈ అతిపెద్ద సర్పం గురించి షాకింగ్ విషయలు..
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్‌లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్‌తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!