Mrunal Thakur: బాయ్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసిన మృణాల్.. ఆగలేకపోతున్న అంటూ పోస్ట్ !
- బాయ్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసిన మృణాల్ ఠాకూర్
- వైరల్‌గా మారిన ఫోటో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mrunal Thakur: మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి బాలీవుడ్‌లో పలు చిత్రాలు చేసి ప్రేక్షకులను మెప్పించిన అందాల నటి మృణాల్ ఠాకూర్. తెలుగులోకి అడుగు పెట్టక ముందు పలు బాలీవుడ్ సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. సినిమాల్లోకి రాకముందే సీరియల్స్ ద్వారా ఈ ముద్దుగుమ్మ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. తన గ్లామర్ షోతో పాటు అద్భుతమైన నటనతో అందరిలో అటెన్షన్ క్రియేట్ చేసింది. ఈ క్రేజ్ ఆమెకు నేరుగా తెలుగులో నటించే అవకాశాన్ని అందించింది. అలా మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ తొలిసారి తెలుగులో నేరుగా నటించిన చిత్రం ‘సీతారామం’ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మృణాల్.. తొలి చిత్రంతోనే వారి హృదయాలను దోచుకుంది. సీత క్యారెక్టర్‌లో నటించి అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది.
Read Also: Devara Release Trailer: ఫ్యాన్స్‌కు బిగ్ ట్రీట్.. ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి మరో ట్రైలర్
Also Read
- T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
ఈ సినిమాతో ఆమెను ఆఫర్లు వెంటాడాయంటే అతిశయోక్తి లేదు. వరుసగా ఆఫర్లు తలుపు తట్టాయి. ఈ సినిమా తర్వాత నాని హీరోగా నటించిన హాయ్ నాన్న చిత్రంలో అవకాశాన్ని అందుకున్న మృణాల్.. అద్భుతంగా నటించి ఏకంగా ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకుంది. అనంతరం విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ”ఫ్యామిలీ స్టార్” సినిమాలో నటించినా.. అది డిజాస్టర్‌గా నిలిచింది. ఈ మధ్య ఫ్లాపులు ఎక్కువగా చవిచూస్తున్న నేపథ్యంలో సినిమాలకు కాస్త బ్రేక ఇచ్చింది. అయినా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు చేరువవుతోంది. తన గ్లామర్‌కు సంబంధించిన ఫోటోలను షేర్ చేసి కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది.
ఈ క్రమంలోనే తాజాగా ఓ వ్యక్తితో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. “హ్యాపీ బర్త్‌డే అమేజింగ్ పర్సన్.. రేపు చెన్నైలో కలుద్దాము. నీ బర్త్‌డేను జరపడానికి నేను ఆగలేకపోతున్నాను” అంటూ రాసుకొచ్చింది. ఆ వ్యక్తితో చనువుగా ఉన్న ఫోటోను కూడా షేర్ చేసింది దీంతో ఈ ఫోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ఆ ఫోటోలోని వ్యక్తి ఎవరంటూ అభిమానులు ఆరా తీయడం మొదలు పెట్టారు. మృణాల్‌కు, ఆ వ్యక్తికి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలియదు కానీ.. ఫోటో మాత్రం వైరల్‌గా మారుతోంది. సినిమాల విషయానికి వస్తే.. కొంతకాలంగా సినిమాలకు బ్రేక్ఇచ్చిన ఈ అమ్మడు.. మళ్లీ మంచి కంబ్యాక్ ఇవ్వాలని చూస్తోంది. మరి నెక్స్ట్ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాల్సిందే.

తాజావార్తలు
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..