Mrunal Thakur : హద్దులు చెరిపేస్తున్న హీరోయిన్.. మృణాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు ప్రేక్షకులకు మృణాల్ అంటే కేవలం ఒక హీరోయిన్ మాత్రమే కాదు, మన ఇంటి అమ్మాయిలాంటి ‘సీత’. దుల్కర్ సల్మాన్ తో చేసిన ‘సీతారామం’ సినిమా ఆమె కెరీర్‌ను ఒక్కసారిగా మార్చేసింది. ఆ సినిమాలో సీతగా ఆమె చూపించిన అభినయం, సౌందర్యం తెలుగు వారిని మంత్రముగ్ధులను చేశాయి. ఆ తర్వాత నానితో ‘హాయ్ నాన్న’ వంటి క్లాసిక్ హిట్స్ అందుకుని టాలీవుడ్లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది. భాషా బేధం లేకుండా తెలుగు, హిందీ, మరాఠీ భాషల్లో వరుస విజయాలు అందుకుంటున్న మృణాల్, ఇటీవలే ‘సన్ ఆఫ్ సర్దార్ 2’తో 2025కి విజయవంతంగా వీడ్కోలు పలికింది. ఇక వచ్చే ఏడాది వరుస ప్రాజెక్టులతో బాక్సాఫీస్‌పై దండయాత్రకు సిద్ధమవుతోంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మృణాల్ మాట్లాడుతూ..
Also Read : Swayambhu : నిఖిల్ ‘స్వయంభు’ కోసం ఎన్టీఆర్ ఎంట్రీ..?
Also Read
- Annamalai: తమిళనాడు రాజకీయాల్లో మరో కొత్త పార్టీ.. అన్నామలై కీలక ప్రకటన..
- Hair Oiling Tips: తలస్నానం చేయడానికి ముందు నూనె రాయాలా? లేక తర్వాత రాయాలా? డౌట్ క్లియర్ చేసుకోండి..
- Deputy CM Pawan Kalyan: రోడ్డు ధ్వంసం చేసిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు.. పవన్ కల్యాణ్ ఆదేశాలు
- Modi-Netanyahu: భారత్‌తో సంబంధాలపై నెతన్యాహు కీలక వ్యాఖ్యలు
తనకు సినిమాల విషయంలో ముందుగానే పక్కాగా ప్లాన్ చేసుకోవడం ఇష్టమని, ముఖ్యంగా తనను ప్రాణంలా ఆరాధించే తెలుగు అభిమానులను ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశపరచకూడదనే పట్టుదలతో ఉన్నట్లు స్పష్టం చేసింది. బాలీవుడ్ తనకు కంఫర్ట్ జోన్ అయినప్పటికీ, నటిగా సరిహద్దులు దాటి కొత్త సవాళ్లను స్వీకరించడమే తన అసలైన ఇష్టమని ఆమె చెప్పుకొచ్చింది. అంతే కాదు
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ.. హిందీ చిత్రం ‘దో దీవానే సెహెర్ మే’ , మరొకటి అడివి శేష్‌తో కలిసి నటిస్తున్న క్రేజీ తెలుగు ప్రాజెక్ట్ ‘డెకాయిట్’.. ఈ రెండు సినిమాలను ఏకధాటిగా చిత్రీకరించడం చాలా సవాలుతో కూడుకున్న పని అని, అయితే తన కలలను నిజం చేయడంలో సహకరించిన దర్శకనిర్మాతలకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. ఒకే సమయంలో రెండు వేర్వేరు భాషా చిత్రాలలో నటించడం కష్టమైనా, ఆ వైవిధ్యమే తనకు సంతృప్తినిస్తుందని మృణాల్ పేర్కొంది. మొత్తానికి సీతగా మెప్పించిన ఈ భామ, రానున్న సినిమాలతో మరింతగా వెలుగు వెలగడం ఖాయంగా కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Annamalai: తమిళనాడు రాజకీయాల్లో మరో కొత్త పార్టీ.. అన్నామలై కీలక ప్రకటన..
-
Hair Oiling Tips: తలస్నానం చేయడానికి ముందు నూనె రాయాలా? లేక తర్వాత రాయాలా? డౌట్ క్లియర్ చేసుకోండి..
-
Deputy CM Pawan Kalyan: రోడ్డు ధ్వంసం చేసిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు.. పవన్ కల్యాణ్ ఆదేశాలు
-
Parthiv Patel-BCCI: ఏడాదికి రూ.3 కోట్లు.. అయినా చీఫ్ సెలెక్టర్ పదవికి నో చెప్పిన పార్థివ్ పటేల్.. అసలు కారణం ఇదేనా?
-
Modi-Netanyahu: భారత్‌తో సంబంధాలపై నెతన్యాహు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Niki Prasad History: ఔరా నిఖీ ప్రసాద్.. తొలి భారత క్రికెటర్‌గా అరుదైన రికార్డు.. ఇప్పటివరకు ఎవరి వల్ల కాలేదు!
-
Cinnamon Plant: మార్కెట్ దాల్చిన చెక్కకు గుడ్ బై.. ఇంట్లోని కుండీలోనే సులువుగా పెంచేయండిలా..
-
Anaya Bangar: శ్రేయస్‌ను చంపేస్తా.. గిల్‌తో డేటింగ్ చేస్తా.. అభిషేక్‌ను పెళ్లి చేసుకుంటా!
-
Josephine Nkomo: మా ఓటమికి కారణం అదే.. టీమిండియాను చూసి చాలా నేర్చుకోవాలి!
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!