Deputy CM Pawan Kalyan: రోడ్డు ధ్వంసం చేసిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు.. పవన్ కల్యాణ్ ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: ప్రజాధనంతో రోడ్లు వేయడం.. కొన్ని ప్రాంతాలు ప్రజలు వారికోసం ఇష్టం వచ్చినట్టు తవ్వేయడం.. మరికొన్ని చోట్ల నిర్లక్ష్యంగా వాహనాలను నడిపిన ఘటనలు ఎన్నో ఉంటాయి.. అయితే, తాజాగా, తిరుపతి జిల్లాలో పల్లెపండుగ కార్యక్రమం ద్వారా నిర్మించిన రహదారిని ధ్వంసం చేసిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. రోడ్డును ధ్వంసం చేసిన వ్యక్తులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయడంతో పాటు, రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద చర్యలు తీసుకుని జరిగిన నష్టాన్ని వసూలు చేయాలని సూచించారు.
తిరుపతి జిల్లా పుల్లంపేట మండల పరిధిలోని అనంతసముద్రం, పాపక్కగారిపల్లె గ్రామాల మధ్య పల్లెపండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా రహదారిని నిర్మించారు. సుమారు వారం రోజుల క్రితమే రూ.4.75 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ రహదారిలో దాదాపు 100 మీటర్ల మేర ట్రాక్టర్‌తో దున్ని ధ్వంసం చేసినట్లు అధికారులు వివరించారు. ఈ ఘటనలో సుబ్బారెడ్డి అనే వ్యక్తితో పాటు వెంకటసుబ్బారెడ్డి అనే మరో వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు సమాచారం. గ్రామస్థులు అందించిన సమాచారం మేరకు కేసు నమోదు చేసినట్లు అధికారులు ఉప ముఖ్యమంత్రికి వివరించారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నాయకుడు సుబ్బారెడ్డిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పవన్.. ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నిందితులను సాయంత్రంలోపు అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.
Also Read
- AP Local Body Elections 2026: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో భారీగా నామినేషన్లు.. YCP నుంచే ఎక్కువ..!
- AP ZPTC, MPTC Elections 2026: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్.. నామినేషన్లు, పోలింగ్, కౌంటిగ్ పూర్తి వివరాలు..
- YS Jagan : రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలు గమనించాలి
- AP Municipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం..
రోడ్డు ధ్వంసం ఘటన, తదుపరి చర్యలపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఇంజనీరింగ్ ఉన్నతాధికారులతో పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. ప్రజల సౌకర్యం కోసం ప్రజాధనంతో నిర్మించే మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించిన వ్యక్తులతో పాటు, వారి వెనుక ఉన్నవారిని కూడా చట్టం ముందు నిలబెట్టాలని అధికారులకు సూచించారు. ప్రజల కోసం ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక సదుపాయాలను ఎవరు ధ్వంసం చేస్తున్నారో ప్రజలకు తెలియజేయాలని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అనంతసముద్రం, పాపక్కగారిపల్లె గ్రామాల మధ్య రహదారిని ధ్వంసం చేసిన వారిపై రెవెన్యూ రికవరీ యాక్ట్‌ను వర్తింపజేసి, మరమ్మతులు లేదా పునర్నిర్మాణానికి అయ్యే నష్టాన్ని బాధ్యుల నుంచి వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
పల్లె పండుగ రోడ్డు తవ్వేసిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు
• రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద చర్యలకు ఉప ముఖ్యమంత్రివర్యుల ఆదేశం
• ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలన్న శ్రీ @PawanKalyan గారుతిరుపతి జిల్లా, పుల్లంపేట మండల పరిధిలోని అనంతసముద్రం, పాపక్కగారిపల్లె గ్రామాల మధ్య పల్లెపండుగ కార్యక్రమం ద్వారా నిర్మించిన రోడ్డును ధ్వంసం చేసిన ఘటనను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా పరిగణించారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసిన వైసీపీ నాయకుడు సుబ్బారెడ్డిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం రోడ్డు ధ్వంసం, తదుపరి చర్యలపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఇంజనీరింగ్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. వారం రోజుల క్రితం పల్లెపండుగ 3.0 ద్వారా రూ. 4.75 కోట్లతో నిర్మించిన రోడ్డును సుబ్బారెడ్డి అనే వ్యక్తి,
వెంకటసుబ్బారెడ్డి అనే మరో వ్యక్తి సాయంతో 100 మీటర్ల మేర ట్రాక్టర్‌తో దున్నేశారని, గ్రామస్థులు ఇచ్చిన సమాచారం మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు అధికారులు వివరించారు. సాయంత్రంలోపు అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా బాధ్యులపై తీసుకోవాల్సిన చర్యలపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు సౌకర్యం కలిగించే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం క్షమించరాని నేరమని, పల్లెపండుగ రోడ్డు ధ్వంసం చేసిన వ్యక్తిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు పెట్టాలని ఆదేశించారు. ప్రజా ధనంతో నిర్మించిన రహదారిని ధ్వంసం చేయడం అనేది దుర్మార్గపు చర్య అనీ, ఆ చర్యలకి పాల్పడ్డ నాయకులు, వారి వెనుక ఉన్నవారినీ కూడా చట్టం ముందు నిలబెట్టాలని స్పష్టం చేశారు. ప్రజల సౌకర్యం కోసం ప్రభుత్వం ఇచ్చే మౌలిక సదుపాయాలుకి ఎవరు నష్టం చేశారో వారి నిజ స్వరూపం అందరికీ తెలియచేయాలి అన్నారు.
అనంతసముద్రం, పాపక్కగారిపల్లె గ్రామాల మధ్య రోడ్డును ధ్వంసం చేసిన వ్యక్తులపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ని వర్తింపజేసి జరిగిన నష్టాన్ని వసూలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని దిశా నిర్దేశం చేశారు.— JanaSena Party (@JanaSenaParty) October 19, 2026
తాజావార్తలు
-
Deputy CM Pawan Kalyan: రోడ్డు ధ్వంసం చేసిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు.. పవన్ కల్యాణ్ ఆదేశాలు
-
Parthiv Patel-BCCI: ఏడాదికి రూ.3 కోట్లు.. అయినా చీఫ్ సెలెక్టర్ పదవికి నో చెప్పిన పార్థివ్ పటేల్.. అసలు కారణం ఇదేనా?
-
Modi-Netanyahu: భారత్‌తో సంబంధాలపై నెతన్యాహు కీలక వ్యాఖ్యలు
-
Hyundai Neira MPV: ఎర్టిగాకు పోటీగా హ్యుందాయ్ కొత్త 7 సీటర్ కారు.. CNG ఆప్షన్ కూడా?
-
Ranabaali : బుకింగ్స్‌తో సత్తా చాటుతున్న ‘రణబాలి’.. విరోష్’కు స్పెషల్ మైల్ స్టోన్!
ట్రెండింగ్
-
Niki Prasad History: ఔరా నిఖీ ప్రసాద్.. తొలి భారత క్రికెటర్‌గా అరుదైన రికార్డు.. ఇప్పటివరకు ఎవరి వల్ల కాలేదు!
-
Cinnamon Plant: మార్కెట్ దాల్చిన చెక్కకు గుడ్ బై.. ఇంట్లోని కుండీలోనే సులువుగా పెంచేయండిలా..
-
Anaya Bangar: శ్రేయస్‌ను చంపేస్తా.. గిల్‌తో డేటింగ్ చేస్తా.. అభిషేక్‌ను పెళ్లి చేసుకుంటా!
-
Josephine Nkomo: మా ఓటమికి కారణం అదే.. టీమిండియాను చూసి చాలా నేర్చుకోవాలి!
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!