తెలుగు ప్రేక్షకులకు మృణాల్ అంటే కేవలం ఒక హీరోయిన్ మాత్రమే కాదు, మన ఇంటి అమ్మాయిలాంటి ‘సీత’. దుల్కర్ సల్మాన్ తో చేసిన ‘సీతారామం’ సినిమా ఆమె కెరీర్‌ను ఒక్కసారిగా మార్చేసింది. ఆ సినిమాలో సీతగా ఆమె చూపించిన అభినయం, సౌందర్యం తెలుగు వారిని మంత్రముగ్ధులను చేశాయి. ఆ తర్వాత నానితో ‘హాయ్ నాన్న’ వంటి క్లాసిక్ హిట్స్ అందుకుని టాలీవుడ్‌లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది. భాషా బేధం లేకుండా తెలుగు, హిందీ, మరాఠీ భాషల్లో వరుస…