Mr Work From Home Teaser: మధుదీప్ చెలికాని డైరెక్షన్‌లో త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ, అనీష్ కురువిల్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కొత్త సినిమా ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’. CH.V.S.N బాబ్జీ సమర్పణలో లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని అరవింద్ మండెం నిర్మించారు. ఈ రోజు చిత్ర టీజర్ గ్రాండ్‌గా లాంచ్ చేశారు. అనంతరం టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో త్రిగుణ్ మాట్లాడుతూ.. ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందని, ఆలోచింపచేస్తూనే ఆనందాన్ని ఇస్తుందన్నారు.
READ ALSO: CP Sajjanar : సంక్రాంతికి ఊరెళ్తున్నారా.? పోలీసులకు సమాచారమివ్వండి
ఆయన మాట్లాడుతూ.. ‘మోడరన్ లైఫ్, పాత పద్ధతిలో ఉన్న వ్యవసాయాన్ని ఎలా కలపొచ్చు అనేది ఈ సినిమాల్లో చాలా ఇంట్రెస్టింగ్‌గా చూపించారు. చాలా ముఖ్యమైన విషయాలు ఇందులో చెప్పాం. త్వరలోనే రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తాం. తప్పకుండా ఈ సినిమాని మీరందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు. అనంతరం డైరెక్టర్ మధుదీప్ మాట్లాడుతూ… ‘నేను ఈ ఇండస్ట్రీలో ఉండడానికి కారణం చంటి గారు. ఆయన లేకపోతే ఈ జర్నీ ఇంత స్మూత్‌గా జరిగేది కాదు. చినప్పుడు విన్న ఒక మాట నా మనసులో బలంగా ముద్రపడిపోయింది. వ్యవసాయ భూమి ఎందుకు అమ్ముకోవాల్సి వస్తుందంటే.. వ్యవసాయం చేసే విధానంలో మార్పు రావాలి.. ఈ ఆలోచనతో చేసిన కథే ఇది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. తప్పకుండా ఈ సినిమా మీ అందరినీ హత్తుకునేలా ఉంటుంది’ అని అన్నారు. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో చిత్ర నటీనటులు, తదితరులు పాల్గొన్నారు.
READ ALSO: Free Tablet Scheme: విద్యార్థులకు ఉచిత టాబ్లెట్లు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసా!