రాహుల్ గాంధీపైన అప్రజాస్వామికంగా, దుర్మార్గంగా బీజేపీ చేస్తున్న కక్ష సాధింపు చర్యలకు నిరసనగా ప్రజాస్వామ్య పద్దతిలో పోరాటం చేస్తున్నామన్నారు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో బీజేపీ, నరేంద్ర మోడీకి దేశ జాతీయ సంపదను పోర్టులూ, విద్యుత్ లైన్లు, అనేక సంపదను అదానీకి దోచిపెట్టాడని, ఈ అంశాలపై రాహుల్ గాంధీ పార్లమెంట్ లో అద్భుతంగా మాట్లాడారన్నారు. దీన్ని తట్టుకోలేక నరేంద్రమోడీ రాహుల్ గాంధీపై పెద్దఎత్తున కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారన్నారు.
Also Read : India at UN: ఆ దేశాల స్వార్థప్రయోజనాలకే “వీటో”.. యూఎన్‌లో గళమెత్తిన భారత్..
కోలార్ కర్ణాటకలో రాహుల్ చేసిన ప్రసంగంపై ఇప్పుడు తీర్పు లు ఇచ్చి ఒక్క గంటల్లోనే ఆయన ఎంపీ పదవిని రద్దు చేశారని ఆయన మండిపడ్డారు. ఒక్క రోజుల్లోనే ఆయన అధికారిక నివాసం ఖాళీ చేయించారని ఆయన మండిపడ్డారు. నీరవ్ మోడీ 14 వేల కోట్ల రూపాయలు దోచులోని బ్యాంక్ లను మోసం చేశారని ఆయన ధ్వజమెత్తారు. లలిత్ మోడీ క్రికెట్ సంఘాన్ని మోసం చేసి లండన్ పారిపోయారని, వారు అగ్రవర్ణాల వారు.. కానీ బీజేపీ ఇది బీసీ వ్యతిరేక అంశం అని ప్రచారం చేసి లబ్ది పొందే ప్రయత్నం చేశారన్నారు. ఈ అంశాలపై మనం కలిసికట్టుగా పోరాటం చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.
Also Read : Marquita Pring: మార్కిటా ‘సౌందర్య బోధ’!