అమెరికన్ మోడల్ మార్కిటా ప్రింగ్ పేరు వింటే చాలు ఆమె స్విమ్ షూట్స్ గుర్తుకు వస్తాయి. 2011లో మోడలింగ్ మొదలు పెట్టిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటి దాకా వేల ఫోటోలతో కుర్రకారును కిర్రెక్కించింది. టాప్ మోడల్ గా హాలీవుడ్ భామలు సైతం సంపాదించనంతగా మార్కిటా పోగేసిందని బ్యూటీ బిజినెస్ వర్గాలు చెబుతున్నాయి. అదలా ఉంచితే, స్విమ్ షూట్స్ లో మార్కిటా ప్రింగ్ అనేక సార్లు తనదైన బాణీ పలికించింది. ముఖ్యంగా ‘ప్యారిస్ ఫ్యాషన్ వీక్’, ‘వోగ్’ వంటి ఇంటర్నేషనల్ మేగజైన్స్ లో మార్కిటా అందాలు ఆరబోసిన పిక్స్ పలు పర్యాయాలు సందడి చేశాయి. వాటిలోనూ ద బెస్ట్ అన దగ్గ ఆరు ఫోటోలను ఎంపిక చేశారు. ఆరు ఫోటోల్లోనూ ఆరు రకాల కురచ స్విమ్ షూట్స్ లో మార్కిటా దర్శనమిస్తోంది.
ఈ ఫోటోలను చూసిన వారు సోషల్ మీడియాలో మార్కిటా మరిన్ని పిక్స్ కోసం అన్వేషణ సాగిస్తున్నారు. రసిక ప్రియులకు తృప్తి అనేది ఓ పట్టాన ఉండదు కదా! అది నిజమేనని మార్కిటా పిక్స్ కోసం నెట్ లో సర్చ్ చేస్తున్నవారి సంఖ్యను బట్టి తెలుస్తోంది. మార్కిటా స్విమ్ షూట్ తో పాటు ఓ తెల్లని గుర్రంతో కలసి తీయించుకున్న ఫోటోలు అన్నిటి కన్నా మిన్నగా కుర్రాళ్ళను ఆకర్షిస్తున్నాయి. ఇలా కనువిందు చేస్తూనే పలు సౌందర్య సాధనాలకు మోడల్ గా వ్యవహరిస్తోంది మార్కిటా. ఫోటోలకు ఫోజులిచ్చే సమయంలో తనకు ఇష్టమైన పాటలు వింటూ ఉంటానని మార్కిటా చెబుతోంది. అలా పాటలు వినడంలో తన ముఖంలో మరింత గ్లో కనిపిస్తుందని, దానిని ఫోటోగ్రాఫర్స్ చక్కగా క్యాప్చర్ చేస్తారని అంటోంది. ఇలాంటి టిప్స్ తన దగ్గర బోలెడు ఉన్నాయని చెబుతోంది. అన్నట్టు మార్కిటా మోడల్ గా నటించే సౌందర్య సాధనాలకు అమెరికాలో భలే క్రేజ్ ఉంది. దానితో పాటు అమ్మడు ఇచ్చే బ్యూటీ టిప్స్ కోసమూ అమ్మాయిలు ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. ‘సౌందర్య బోధ’ అంటే ఇదే కాబోలు!