Mudragada Padmanabham: నేడు ముద్రగడ నివాసానికి మిథున్‌రెడ్డి.. ఎన్నికల కోడ్‌కు ముందే కీలక పదవి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mudragada Padmanabham: ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది.. ఓవైపు ఢిల్లీ వేదికగా.. ఈ రోజు టీడీపీ-జనసే-బీజేపీ పొత్తుపై క్లారిటీ వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తుండగా.. మరోవైపు.. కీలక నేతలను, అసంతృప్తులను పార్టీలోకి ఆహ్వానించేపనిలో పడిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఇక, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా వైసీపీ గూటికి చేరడం ఖాయమైపోయింది.. ఈ రోజు ఉదయం 11 గంటలకు ముద్రగడ నివాసానికి వెళ్లనున్నారు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్, ఎంపీ మిథున్ రెడ్డి.. జిల్లా పార్టీ నేతలతో కలిసి కిర్లంపూడి వెళ్లనున్న మిథున్ రెడ్డి.. ముద్రగడతో సమావేశం కానున్నారు.. ముద్రగడను పార్టీలోకి ఆహ్వానించనుంది వైసీపీ బృందం.. మరోవైపు.. పద్మనాభం కుమారుడు ముద్రగడ గిరికి ఈ ఎన్నికల కోడ్ రాకముందే నామినేటెడ్ పదవిపై హామీ ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఈ విషయాన్నే స్వయంగా ముద్రగడకు వివరించనున్నారట మిథున్‌రెడ్డి..
Read Also: Uttarpradesh : చౌరస్తా మధ్యలో చెట్టుకు ఉరేసుకున్న వ్యక్తి.. ప్రేక్షకపాత్ర పోషించిన పోలీసులు
Also Read
- iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్‌లు..
అయితే, ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండబోతోంది ముద్రగడ కుటుంబం.. ఇక, ఎన్నికల ముగిసిన తర్వాత ముద్రగడ పద్మనాభంకి తగిన పదవి ఉంటుందని కూడా మిథున్ రెడ్డి హామీ ఇస్తారనే చర్చ సాగుతోంది. ఇక, ఈ నెల 12వ తేదీన ముద్రగడ పద్మనాభం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని ఆయన అనుచరులు చెబుతున్నమాట. కాగా, మొదట వైసీపీపై అసంతృప్తి వ్యక్తం చేసిన ముద్రగడ.. ఆ పార్టీలోకి వెళ్లేది లేదని బహిరంగంగా ప్రకటించారు.. జనసేన, టీడీపీలో చేరేందుకు కూడా ఆయన సిద్ధమని సంకేతాలు ఇచ్చారు.. ఓ దశలో జనసేన పార్టీలో ముద్రగడ చేరడం ఖాయమనే ప్రచారం సాగింది.. అంతేకాదు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. కిర్లంపూడి వెళ్లి ముద్రగడను పార్టీలోకి ఆహ్వానిస్తారనే ప్రచారం కూడా సాగింది.. కానీ, అంతా సైలెంట్ కాగా.. ఇప్పుడు వైసీపీ ఆయనతో టచ్‌లోకి వెళ్లింది.
తాజావార్తలు
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!