NTV Telugu Site icon

MP Margani Bharat: చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌కు ఎంపీ భరత్‌ చాలెంజ్‌.. ఆ దమ్ముందా..?

Margani Bharat

Margani Bharat

MP Margani Bharat: మంగళగిరిలో జయహో బీసీ బహిరంగ సభ నిర్వహించిన టీడీపీ-జనసేన.. బీసీ డిక్లరేషన్‌ను విడుదల చేశాయి.. దీంతో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌పై ఎదురుదాడికి దిగింది అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఎంపీ మార్గాని భరత్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు ఛాలెంజ్ చేస్తున్నా.. మేం ఇచ్చిన స్థాయిలో బీసీలకు మీరు సీట్లు ఇవ్వగలరా..? అని సవాల్‌ చేశారు.. ఇదే చంద్రబాబు నాయుడు ఒకటి కాదు రెండు కాదు 14 సంవత్సరాలు రాష్ట్రాలు పాలించాడు.. అప్పుడు బీసీ డిక్లరేషన్ గుర్తు రాలేదా? ఇవాళ కొత్తగా డ్రామాకి తెరలేపాడు.. బీసీల కోసం 50,000 కోట్లు ఖర్చు పెట్టామన్నారు.. చంద్రబాబుతో బీసీలకు సంబంధించిన చర్చలకు నేను రెడీగా ఉన్నాను అన్నారు.

Read Also: Underwater Metro : అండర్ వాటర్ మెట్రోను ప్రారంభించి.. అందులో ప్రయాణించిన మోడీ

ఇక, బీసీలకు సీఎం వైఎస్‌ జగన్ 75 వేల కోట్ల రూపాయలు ఇచ్చారు.. నేరుగా లక్షా 70 వేల కోట్లు బీసీల ఖాతాల్లో పడిందని వివరించారు ఎంపీ భరత్.. అధికారంలోకి వస్తే లక్షన్నర కోట్లు ఖర్చు పెడతామని చంద్రబాబు అబద్ధం మాటలు మాట్లాడుతున్నారన్న ఆయన.. బీసీల డీఎన్ఏ తెలుగుదేశం పార్టీ అని చెప్పే చంద్రబాబు.. బీసీలకు ఇచ్చింది 21 సీట్లు మాత్రమే అని విమర్శించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజమండ్రి సీటు జగనన్న బీసీలకు ఇచ్చాడు.. కనీసం నువ్వు ఆ సాహసం చేశావా? అని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌కు ఛాలెంజ్ చేస్తున్నా.. మేం ఇచ్చిన స్థాయిలో బీసీలకు మీరు సీట్లు ఇవ్వగలరా..? మీ చిత్తశుద్ధి ఏమిటో ప్రజలకు తెలిసిపోతుంది..? కదా అన్నారు. ఈ 42 ఏళ్లలో రాజ్యసభ సీట్లు ఎంతమంది బీసీలకు ఇవ్వగలిగారు అని చంద్రబాబును నిలదీశారు ఎంపీ భరత్‌.