NTV Telugu Site icon

MP Laxman: రైతుల దుస్థితిపై బీజేపీ రాష్ట్ర వ్యాప్త పర్యటనలు..

Bjp Mp Laxman

Bjp Mp Laxman

రైతుల దుస్థితిపై బీజేపీ రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తుందని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నిర్ణయం మేరకు రైతులను కలుస్తున్నామన్నారు. మిల్లర్లతో ప్రభుత్వం కుమ్మకై రైతుల పొట్ట కొట్టే పని చేస్తుందని మండిపడ్డారు. నెల రోజులుగా కుప్పలు పోసిన ధాన్యాన్ని కొనే వారు లేరని.. కలెక్టర్, అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. సమస్యను పరిష్కరిస్తామని వారు సమాధానమిచ్చినట్లు చెప్పారు. మూసీ ప్రక్షాళన పేరుతో పాదయాత్రలు కాదు.. రైతుల దగ్గరకు వెళ్లాలని డిమాండ్ చేశారు. మీ పాలన ఎలా సాగుతుందో రైతుల దగ్గరకు వెళ్తే అర్థం అవుతుందన్నారు. దున్నపోతు నిద్రల వ్యవహరిస్తున్న మంత్రులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. అకాల వర్షాలు వస్తే ధాన్యం ఏం అవ్వాలి. రైతులు ఎటు పోవాలి? అని ఆందోళన వ్యక్తం చేశారు. ఉదారంగా కేంద్రం రైతులను ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ రైతుల పొట్ట కొడుతుందని.. రేవంత్ ప్రభుత్వంలో క్వింటాల్ వడ్లపైన వెయ్యి రూపాయల నష్టానికి అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ధాన్యం కొనుగోలుకు కేంద్రమే డబ్బులు ఇస్తు్న్నా.. ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు? అని ప్రశ్నించారు.

READ MORE: Former CM Nadendla Bhaskara Rao: కుల గణనకు నేను వ్యతిరేకం కాదు.. కానీ ఓ అనుమానం!

సన్నాలకు బోనస్ అన్నారు.. ఇప్పటికీ లేదని.. రైతు భరోసా.. కౌలు.. కూలి రైతులకు ఇచ్చిన హామీలన్నీ ఇప్పటికీ అమలు కాలేదని మండిపడ్డారు. రైతు భరోసా కాదు కదా.. ఇచ్చిన హామీలన్నీ బంద్ చేశారన్నారు. ఎన్నికలకు ముందు అన్ని రకాల వడ్లకు బోనస్ అన్నారు.. ఇప్పుడు సన్నాలకు మాత్రమే బోనస్ అంటూ రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. 2014 లో యూపీఏ హయాంలో 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారని. నరేంద్రమోడీ ప్రభుత్వం 92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందని గుర్తు చేశారు. 27 కోట్లను ధాన్యం కొనుగోలుకు కేటాయించారని చెప్పారు. ధాన్యం కొనుగోలుకు మోడీ ప్రభుత్వం ఇచ్చిన పైసలను రేవంత్ ఎందుకు ఖర్చు చేయడం లేదని అడిగారు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం.. రైతు ఏడ్చిన రాష్ట్రం బాగుపడదన్న నానుడిని గుర్తుచేశారు. తాము రాజకీయం కోసం కాదు.. రైతుల కోసం పర్యటనలు చేస్తున్నామన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం విడవమని స్పష్టం చేశారు.

Show comments