MP Kesineni Nani: ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా గెలుస్తా.. మూడోసారి ఎంపీని నేనే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Kesineni Nani: విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి సొంతపార్టీ, అధినేతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరిలో నా నిర్ణయం ప్రకటిస్తానని ఆయన తెలిపారు. శుక్రవారం విజయవాడలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీలో కొనసాగాలా ? వద్దా ? అనే విషయంపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం తప్పెలా అవుతుందని కేశినేని ప్రశ్నించారు. ఇప్పటికే రెండుసార్లు ఎంపీగా గెలిచానని, స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేసి మూడోసారి విజయం సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మరో రెండు రోజుల్లో జరుగనున్న పార్టీ సమావేశానికి రావొద్దని తనకు సమాచారం అందించారని, చంద్రబాబు ఆదేశాలను శిరసా వహిస్తానని పేర్నొన్నారు. ఏడాదిగా కేశినేని నాని పార్టీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. తరుచూ పార్టీపై ఆరోపణలు చేస్తుండడంతో పార్టీలో ఆయన కేంద్ర బింధువుగా మారారు. పార్టీ మారుతాడని ప్రచారం జరుగుతున్నా వాటిని ఖండిస్తున్న నాని కొద్ది రోజుల్లో తన అనుచరులు, నాయకులతో కలిసి నిర్ణయం తీసుకోనున్నారు.
Read Also: Kapu Ramachandra Reddy: ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేస్తా.. వైసీపీకి ఎమ్మెల్యే గుడ్‌బై!
Also Read
- Ambati Rambabu: మాజీ మంత్రి అంబటిపై కేసు నమోదు!
- Rain Alert: తీవ్ర వాయుగుండం ముప్పు.. మూడు రోజులు ఈ జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలెర్ట్!
- 50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
- US-Iran Conflict: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా బిగ్ షాక్.. సెప్టెంబర్ 23 నుంచి పూర్తిగా బంద్?
కేశినేని నాని మాట్లాడుతూ.. “నా అభిమానులకు క్లారిటీ ఉంది.. అధినేత చెప్పింది రామభక్త హనుమాన్‌లాగా పాటిస్తాను. నాకు నా అభిమానులకు టెలీపతీ ఉంది. తినబోతూ రుచులు ఎందుకు. ఒకళ్ళు ఓడాలి… ఒకరు గెలవాలి… తప్పేం లేదుగా. నన్ను నమ్ముకుని వేల మంది ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమన్నారు.. నేను బొమ్మసాని సభకు వెళ్ళడం లేదు. పార్టీ కార్యక్రమాలకు వద్దనే అధికారం అధినేతకు ఉంది… కానీ ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనవద్దని అనలేరు. పార్టీ అన్నాక అధినేతకు కొన్ని తప్పనిసరి పతిస్ధితులుంటాయి. చంద్రబాబును కూడా తప్పు అనడానికి లేదు. ఇద్దరు మాజీమంత్రులు, ఒక మాజీ ఎంపీ అబద్ధం చెపుతారా?. నేను ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తాను. మూడోసారి నేను విజయవాడ పార్లమెంటు నుంచి ఎన్నిక అవుతాను. ఒక పొలిట్ బ్యూరో సభ్యుడు, ఒక వ్యక్తి ప్రెస్ మీట్‌లో చెప్పుతో కొడతా అన్నారు. 30కి పైగా కార్పొరేటర్లు గెలవాల్సి ఉండగా… కావాలని ఓడించారు. రేవంత్ రెడ్డి వెళ్ళి ప్రధాని, హోంమంత్రిలను కలిసారు ఏమైనా తప్పుందా. నేను వైసీపీ నేతలతో ప్రోగ్రామ్‌లలో పాల్గొనటానికి ప్రజాప్రతినిధిగా మంచి సాంప్రదాయం ప్రకారం కలిసి ఉండొచ్చు. అది ఎలా తప్పు అవుతుంది.” అని కేశినేని నాని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Ambati Rambabu: మాజీ మంత్రి అంబటిపై కేసు నమోదు!
-
Rain Alert: తీవ్ర వాయుగుండం ముప్పు.. మూడు రోజులు ఈ జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలెర్ట్!
-
JAILER 2 : నీలాంబరిని విద్యాబాలన్ మైమరిపించగలదా..?
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
US-Iran Conflict: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా బిగ్ షాక్.. సెప్టెంబర్ 23 నుంచి పూర్తిగా బంద్?
ట్రెండింగ్
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!