ఢిల్లీ కేజ్రీవాల్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు బీజేపీ జాతీయ బీసీ మోర్చా అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పొట్ట గూటి కోసం 30 సంవత్సరాలుగా ఢిల్లీలో పనులు చేసుకుంటున్నారని, ఢిల్లీలో బీసీ సర్టిఫికెట్ పొందాలంటే కేజ్రీవాల్ ప్రభుత్వం కొన్ని షరతులు విధించిందని ఆయన మండిపడ్డారు. 1993 నుంచి ఢిల్లీలో ఉంటే మాత్రమే బీసీ సర్టిఫికెట్ ఇస్తామని షరతులు పెట్టిందని, ఢిల్లీలో కోటి యాభై లక్షల మంది బీసీలు ఉన్నారని ఆయన వెల్లడించారు. బీసీ సర్టిఫికెట్ ఇవ్వకపోవడం వల్ల స్కూళ్లలో, ఉద్యోగాల్లో బీసీ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని ఆయన మండిపడ్డారు.
Also Read : Prashanth Varma: క్రియేటివ్ డైరెక్టర్ కథతో ఘట్టమనేని ఫ్యామిలీ హీరో
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీసీ విద్యార్థుల కోసం మెడికల్ కాలేజీలో పీజీ కాలేజీలో రిజర్వేషన్లు ఇచ్చారని, కానీ కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయం వల్ల బీసీలు రిజర్వేషన్ పొందే అవకాశం లేదని ఆయన ధ్వజమెత్తారు. కేజ్రీవాల్ ఢిల్లీలో ప్రభుత్వంలో అధికారులకు వచ్చాక షరతులు తీసివేస్తామని హామీ ఇచ్చారని, తొమ్మిది సంవత్సరాలు ఢిల్లీలో కేజీలు వారి ప్రభుత్వం ఉన్న ఇంతవరకు దాన్ని పట్టించుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వంలో బీసీ కేంద్రమంత్రులు చాలామంది ఉన్నారని, ప్రధానమంత్రి మోడీ బీసీలకు అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నారన్నారు. పార్లమెంట్‌లో ఏ అంశాలపై అయినా చర్చకు సిద్ధమని ఆయన వెల్లడించారు. ప్రతిపక్షాలు ప్రజా సమస్యలపై చర్చ జరపకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : tack in Hyderabad: హైదరాబాద్‌లో ఉగ్రదాడులకు పాకిస్తాన్ ప్లాన్.. ఎన్ఐఏ రిపోర్టులో వెల్లడి..