Site icon NTV Telugu

MP Arvind : కల్వకుంట్ల కుటుంబం అంతా దొంగలే

Mp Aravind

Mp Aravind

కల్వకుంట్ల కుటుంబం అంత దొంగలే అంటూ మరోసారి విమర్శలు గుప్పించారు బీజేపీ ఎంపీ అరవింద్. అసలైన ఉద్యమకారుడు ఈటల రాజేందర్ అని, రాష్ట్రంలో తొమ్మిది ఏళ్లలో సమస్యలు పెరిగాయన్నారు ఎంపీ అరవింద్‌. ఉస్మానియా ఆసుపత్రిలో ఎలుకలు, కుక్కలు ఉంటున్నాయని, ట్యాంక్ బండ్ నీళ్లల్లో బోటింగ్‌కు వెళ్లే విధంగా మరుస్తాను అన్నారని, ఇంటికో ఉద్యోగం, అమరవీరుల కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం అన్నారని ఆయన గుర్తు చేశారు. ఏ ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చిన కోర్ట్ కి వెళ్లాల్సిన పరిస్థితి ఉందని, వైన్స్ టెండర్స్ మాత్రం పక్కగా జరుగుతాయన్నారు. దీని మతలబు ఏంటో లిక్కర్ రారాణి చెప్పాలంటూ విమర్శలు గుప్పించారు. ఈ మధ్య కేసీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం నేనే అని, ఇళ్లు కట్టాలంటే హౌసింగ్ శాఖ ఉండాలి… అది లేనే లేదన్నారు. మరి ఇల్లు ఎవరు కడతారు? హౌసింగ్ శాఖ లో ఉన్న ఉద్యోగులను ఇతర శాఖలకు బదిలీ చేసారని, కుల ధ్రువీకరణ పత్రానికే 30రోజుల సమయం కావాలన్నారు.

Also Read : Leopard Attack: చిరుత దాడిలో చిన్నారి మృతి.. టీటీడీ కీలక నిర్ణయం

అలాంటిది మూడు రోజుల్లో గృహలక్ష్మి కి ఎలా దరఖాస్తు చేస్తారు? ఏ మొహం పెట్టుకొని నిజామాబాద్ వచ్చారు? ఆరు లక్షలు ఇస్తామని మేనిఫెస్టో లో ఉంది కాదా? మూడు లక్షలు ఇవ్వడం ఎంటి. గడాఫీ గతే కేసీఆర్ కి రాబోతుంది.. కవిత రాజకీయ జీవితం ఖతం అయిపోయింది. గజ్వేల్లో తప్ప కవిత ఎక్కడా నిలబడ్డా ఓడిపోతుంది. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి పోటీ చేయాలి. ప్రగతి భవన్ లో కేసీఆర్ తాగి పండితే.. ఫార్మ్ హౌస్ లో లేస్తారు. 100కోట్లు ఎకరం పలకడం అభివృద్ది కాదు. ఈ భూములను సామాన్య ప్రజలు కొనగలరా?
తాగి, మత్తు పదార్థాలతో పాలన చేసే వాళ్ళకి ప్లానింగ్ ఉంటాదా? కల్వకుంట్ల కుటుంబానికి కేవలం మూడు నెలల సమయం మాత్రమే ఉంది. ఊర్లలో కేసీఆర్ కుటుంబం పేరు ఎత్తితే చెప్పలేని తిట్లు తిడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో బీఅర్ఎస్ పార్టీకి డబుల్ డిజిట్ కూడా రాదు’ అని ఎంపీ అరవింద్‌ వ్యాఖ్యానించారు.

Tetanus Shot : దెబ్బ తగిలిన ప్రతీసారీ టీటీ ఇంజెక్షన్‌ అవసరమేనా? మీ కోసమే పూర్తి వివరాలు?

Exit mobile version