50MP సోని కెమెరా, 68W ఫాస్ట్ ఛార్జింగ్ తో Moto G Stylus (2026) లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Moto G Stylus (2026): మొటరోలా తన పాపులర్ స్టైలస్ సిరీస్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్ Moto G Stylus (2026) ను అమెరికా, కెనడా మార్కెట్లలో అధికారికంగా విడుదల చేసింది. గత ఏడాది విడుదలైన మోటో జి స్టైలస్ (2025)కు ఇది సక్సెసర్‌గా వస్తోంది. ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ దీనితో పాటు వచ్చే ఇన్‌బిల్ట్ యాక్టివ్ స్టైలస్. ఇది సపోర్టెడ్ యాప్స్‌లో టిల్ట్ (tilt), ప్రెజర్ కు అనుగుణంగా స్పందిస్తూ డ్రాయింగ్, నోట్స్ రాసుకోవడానికి అద్భుతమైన అనుభూతినిస్తుందని కంపెనీ పేర్కొంది.
Also Read
- iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
- Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
- సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
అమెరికా మార్కెట్లో 8GB RAM + 128GB స్టోరేజ్ కలిగిన ఏకైక వేరియంట్ ధరను 499 డాలర్స్ గా నిర్ణయించారు. ఇది పాంటోన్ కోల్ స్మోక్, పాంటోన్ లావెండర్ మిస్ట్ అనే రెండు ఆకర్షణీయమైన రంగుల్లో, లెదర్ ఫినిషింగ్‌తో లభిస్తుంది. ఏప్రిల్ 16 నుండి అమెజాన్, బెస్ట్ బై, మోటరోలా వెబ్‌సైట్లలో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. కెనడా వినియోగదారులు కూడా అదే రోజు నుండి దీనిని కొనుగోలు చేయవచ్చు.
ఈ స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల 1.5K pOLED స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 5,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. దీనికి రక్షణగా గొరిల్లా గ్లాస్ 3 ఉంది. ఇంకా ఈ ఫోన్ IP68+IP69 రేటింగ్‌తో వస్తోంది. అంటే ఇది దుమ్ము, నీటి నుండి రక్షణను అందిస్తుంది. మోటో జి స్టైలస్ (2026) లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 (Android 16) ఆధారిత మోటరోలా హలో యూఎక్స్ (Hello UX) పై నడుస్తుంది. ఇందులో స్నాప్ డ్రాగన్ 6 జెన్ 3 చిప్‌సెట్‌ను అమర్చారు. 8GB ఫిజికల్ ర్యామ్‌తో పాటు, ‘ర్యామ్ బూస్ట్’ ఫీచర్ ద్వారా దీనిని 24GB వరకు పెంచుకోవచ్చు. అలాగే మైక్రో ఎస్‌డి కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 1TB వరకు పెంచుకునే అవకాశం ఉంది.
ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ప్రధాన కెమెరాగా 50MP (Sony LYT-700C సెన్సార్) తో OIS సపోర్ట్ లభిస్తుంది. ఇంకా అల్ట్రా-వైడ్ కెమెరా 13MP (మాక్రో విజన్ సపోర్ట్‌తో), సెల్ఫీ కెమెరాగా 32MP కెమెరా వస్తుంది. ఇంకా ఈ ఫోన్‌లో 5,200mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అందించారు. ఇది 68W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయాన్ని కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, Wi-Fi 6/6E, బ్లూటూత్, NFC, USB టైప్-సి పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
తాజావార్తలు
-
iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
-
Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
-
సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!