Jowar Ambali Recipe: ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉండే హెల్తీ, టేస్టీ డ్రింక్.. పాత పద్దతిలో జొన్న అంబలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jowar Ambali Recipe: జొన్నలు ఆరోగ్యానికి చాలా మేలు చేకూరుస్తాయి. అమ్మమ్మలు తాతయ్యల నాటి కాలం నుంచి జొన్నలు పల్లెల్లో తింటూ వస్తున్నారు. ప్రస్తుతం మారుతున్న జీవన పరిణామాల మధ్య ఏదైనా జబ్బులు వస్తేనే జొన్నలు తినడం అలవాటు చేసుకుంటున్నారు. అయితే.. వేసవిలో జొన్నలు తినడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. వీటి వల్ల శరీరానికి అద్భుతమైన చల్లదనం లభిస్తుంది. ముఖ్యంగా జొన్న జావ తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గి, డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. ఇవి ఫైబర్, ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉండటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరచి, శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. వేసవి తాపాన్ని తట్టుకోవడానికి జొన్న జావ లేదా అంబలి చాలా మంచిది. ఇది శరీరంలో అధిక వేడిని తగ్గించి, హాయిని ఇస్తుంది. తక్కువ సమయంలో ఎక్కువ శక్తిని ఇచ్చే జొన్న అంబలి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..
READ MORE: YS Jagan Padayatra: వచ్చే సంవత్సరం నా పాదయాత్ర.. ఇక, చంద్రబాబుకి ప్రతిరోజూ సినిమా చూపిస్తాం..!
Also Read
- Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
- Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
- Soft Roti Tips: ప్రతి రొట్టె బెలూన్లా పొంగాలి.. మెత్తగా ఉండాలా..? అయితే, ఈ చిట్కాలు పాటించండి
- Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
కావలసిన పదార్థాలు:
జొన్న పిండి: 1 కప్పు
పెరుగు (పులియబెట్టడానికి): 1 టేబుల్ స్పూన్
నీళ్లు: 2 కప్పులు (అవసరానికి తగినట్లుగా మరికొన్ని)
ఉప్పు: రుచికి సరిపడా
తయారీ విధానం:
ఒక పాత్రలో ఒక కప్పు జొన్న పిండిని తీసుకుని, అందులో ఒక టేబుల్ స్పూన్ పెరుగు, ఒక కప్పు నీళ్లు పోయాలి. ఉండలు లేకుండా బాగా కలిపి, రాత్రంతా పక్కన పెట్టాలి. ఇలా నానబెట్టడం వల్ల పిండి పులిసి, అంబలికి మంచి రుచి, పోషక విలువలు వస్తాయి. మరుసటి రోజు ఉదయం చూస్తే, పిండి కిందకు చేరి పైన నీళ్లు పేరుకుని ఉంటాయి. ఆ పై నీటిని జాగ్రత్తగా ఒక గిన్నెలోకి తీసుకుని స్టవ్ మీద పెట్టి మరిగించాలి. అవసరమైతే మరో కప్పు నీటిని కూడా జోడించవచ్చు. నీళ్లు మరుగుతున్నప్పుడు, అడుగున ఉన్న జొన్న పిండి మిశ్రమాన్ని అందులో పోసి గరిటెతో తిప్పుతూ ఉండాలి. తగినంత ఉప్పు వేసి, సుమారు 10 నిమిషాల పాటు తక్కువ మంట మీద ఉడికించాలి. అడుగు అంటకుండా గరిటెతో తిప్పుతూ ఉండటం ముఖ్యం. అంబలి మరీ చిక్కగా అనిపిస్తే, కొద్దిగా నీళ్లు పోసి సూప్ మాదిరిగా పలచగా వచ్చేలా చూసుకోవాలి. వేడివేడి జొన్న అంబలిని ఒక గ్లాసులోకి తీసుకుని, పైన ఒక స్పూన్ గడ్డ పెరుగు వేసుకుని తాగితే ఆ రుచే వేరు!.. మీరూ తప్పక ట్రై చేయండి..
తాజావార్తలు
-
India Women Cricket: 5 ఓవర్లలోనే టార్గెట్ ఉఫ్.. టీ20ల్లో భారత మహిళల జట్టు సరికొత్త రికార్డు!
-
Vijayasai Reddy: టీడీపీ, వైసీపీకి మూడో ప్రత్యామ్నాయం మేమే.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
OTT Releases: ఓటీటీ లవర్స్ కి పండగో పండగ.. సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చేశాయి
-
DADA Movie : ‘దాదా’టార్గెట్ ఫిక్స్.. నటసింహం వస్తున్నాడు
ట్రెండింగ్
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?