Tragedy: అన్నమయ్య జిల్లా గాలివీడు మండల కేంద్రంలోని చిలకలూరిపేటలో విషాదం చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లలతో సహా తల్లి చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. చెరువుకట్ట పై నుంచి పిల్లలతో పాటు దూకి మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. భార్యాభర్తల మధ్య ఘర్షణతో మనస్తాపం చెందిన భార్య పిల్లలతో పాటు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. దంపతులు విక్రమ్, వేముల నాగరాణి(30)కి కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. శుక్రవారం భర్త విక్రమ్‌తో ఘర్షణ పడిన నాగరాణి తన ముగ్గురు పిల్లలను వెంట తీసుకుని ఇంటి నుండి వెళ్లిపోయింది.
Read Also: IPL tickets Hyderabad: ఐపీఎల్ టికెట్స్ ను బ్లాక్ లో అమ్ముతూ అడ్డంగా బుక్కైన ఐటీ ఉద్యోగులు..
తన ముగ్గురు పిల్లలతో కలిసి వెలుగల్లు సమీపంలోని గండిమడుగు నీటిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. గండిమడుగు ఒడ్డున చెప్పులు, సెల్ ఫోన్‌ను చూసి నాగరాణి బంధువులు గుర్తించారు. గండిమడుగు నీటిలో తేలియాడుతున్న మృతదేహాలను బంధువులు, పోలీసులు వెలికి తీశారు. ఈ ఘటనలో నాగరాణి(30), తన ముగ్గురు పిల్లలు నవ్యశ్రీ(10), దినేష్(6), జాహ్నవి (3)లు మృతి చెందారు. కుటుంబకలహాలతోనే ఆమె తన పిల్లలతో కలిసి చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నాగరాణి, ఆమె భర్త విక్రమ్‌కు మధ్య కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నాగరాణి తన ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
