Sana Don : దొంగతనాలకు తల్లి స్కెచ్.. పిల్లలతో కలిసి చోరీలు.. చివరికి ట్విస్ట్.!
- తల్లి మార్గదర్శకం – పిల్లలను తప్పుదోవ పట్టించిన సనా డాన్!
- దొంగతనాల కోసం ముందుగా రెక్కీ – తర్వాత పిల్లలతో ఆపరేషన్!
- 500కి పైగా సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు – చివరికి ముఠా అరెస్టు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sana Don : తల్లి డైరెక్షన్ తో పిల్లలు ముందుకు వెళ్తారు. అయితే తల్లి డైరెక్షన్ మంచిది అయితే ఇక్కడ స్టోరీ చెప్పుకోవాల్సిన పనిలేదు.. ఆ తల్లి ఏకంగా ఒక డాన్.. పిల్లల్ని మంచి దిశగా తీసుకుని అవసరం ఉంది.. కానీ తన పిల్లల్ని కూడా తన దారిలోకి తీసుకొని వచ్చింది.. తల్లి దొంగతనాల కోసం స్కెచ్ వేస్తోంది.. ఆ తర్వాత పిల్లలు వెళ్లి దోచుకుని వస్తారు.. ముగ్గురు పిల్లలు తల్లి కలిసి హైదరాబాదులోని అత్యంత ధనవంతుడు ఉండే ప్రాంతాలను దోచుకుని పోతున్నారు. సనా డాన్ కు ముగ్గురు పిల్లలు ఉన్నారు.. దాదాపు ఇప్పటివరకు 50 పైగా దొంగతనాలు చేశారు.. ఎక్కడైతే ధనవంతుల ఎన్నో ఉంటాయో ఆ ఏరియాలో తల్లి వెళ్లి ముందుగా రెక్కీ చేస్తుంది. ఆ తర్వాత దానికి సంబంధించిన సమాచారం పిల్లలకు చెప్తుంది.. రాత్రికి రాత్రే పిల్లలు వెళ్లి ఇల్లు మొత్తాన్ని గుల్ల చేసుకుని వస్తారు ..ఆ తర్వాత ఆ డబ్బులతో ఎంజాయ్ చేస్తారు.
మంచి చెడులు నేర్పించి.. పిల్లలను సరైన దారిలో నడిపించాల్సిన ఆ తల్లి తన కుమారులను తప్పుదారి పట్టించింది. తాను దొంగతనాలు చేయడమే కాకుండా..ముగ్గురు కొడుకులను కూడా అదే మార్గంలోకి దించింది. తాళం వేసిన ఇళ్లను గుర్తించడం.. తన కొడుకులను ఆ ఇంటికి పంపించి దొంగతనాలు చేయించడం.. చోరీసొత్తును గుట్టు చప్పుడు కాకుండా అమ్మడమే కాకుండా వారి తరఫున లాయర్లను మాట్లాడి బెయిల్ ఇప్పించడం అలవాటుగా మార్చుకుంది. నగరంలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీ ఘటనల్లో నిందితురాలిగా ఉన్న కరడుగట్టిన నేరస్థురాలు సనా బేగం అలియాస్ సనా టైగర్ అలియాస్ సనా డాన్ తో పాటు ఆమె కొడుకు సోహైల్ ను డైమండ్ హిల్స్ కాలనీలో చోరీ ఘటనలో అరెస్ట్ చేసిన ఫిలిం నగర్ పోలీసులు రిమాండ్ తరలించారు.
Also Read
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
- EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
షేక్‌పేట సమీపంలోని డైమండ్ హిల్స్ కాలనీకి చెందిన మహ్మద్ ముజాహిద్ కమల్ అనే ఎన్‌ఆర్‌ఐ ఇంట్లో ఇటీవల 34 తులాల బంగారు ఆభరణాలతో పాటు సుమారు 4.5 లక్షల నగదు, విదేశీ కరెన్సీ చోరీ అయ్యింది. బండ్లగూడకు చెందిన సనా బేగం అలియాస్ సనా టైగర్ అలియాస్ సనా డాన్, తన ముగ్గురు కుమారులు మహమ్మద్, సాహిల్, సోహైల్‌తో కలిసి ఈ దొంగతనానికి పాల్పడింది. దొంగతనం అనంతరం ఆటోలో పారిపోతున్న క్రమంలో పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు నిందితులు అనేక ప్లాన్‌లు వేశారు. చోరీ అనంతరం నేరుగా బండ్లగూడలోని తమ ఇంటికి వెళ్తే సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు గుర్తించే అవకాశం ఉందని భావించి.. సుమారు రెండు గంటల పాటు రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాల్లోని కొన్ని బస్తీలోని సందుగొందుల్లో తిరిగారు. అయినప్పటికీ పట్టువదలని విక్రమార్కుల్లా పోలీసులు 500కి పైగా సీసీ కెమెరాలను సుమారు 40 గంటల పాటు జల్లెడపట్టి ఎట్టకేలకు బండ్లగూడలోని నిందితుల నివాసాన్ని గుర్తించారు. అయితే పోలీసులు తమ ఇంటికి వస్తున్నారన్న విషయం తెలుసుకున్న నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. కాగా, దొంగిలించిన బంగారంలో కొంత భాగాన్ని అమ్మేందుకు ప్రయత్నించి సనా బేగం, ఆమె రెండో కొడుకు సోహైల్ పోలీసులకు చిక్కారు. వారి నుంచి 10 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
నిందితురాలు సనా బేగం ను వైద్య పరీక్షల కోసం స్థానికంగా ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ కూడా ఆమె హైడ్రామా చేసినట్లు తెలిసింది. తనకు ఆరోగ్యం సరిగా లేదని.. తనను అరెస్టు చేసేలా రిపోర్ట్ ఇస్తే తర్వాత జరిగే పరిణామాలకు నీదే బాధ్యత అంటూ సదరు వైద్యుడిని దబాయించిందని తెలిసింది. ఎట్టకేలకు అర్ధరాత్రి దాటిన తర్వాత ఉస్మానియా ఆస్పత్రిలో పలు రకాల వైద్య పరీక్షల అనంతరం నిందితులను న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. సనా బేగంపై దాదాపు 43 కేసులు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
Railway Ticket Discounts: వారందికీ 75% వరకు రైల్వే టికెట్ పై రాయితీ!
తాజావార్తలు
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్‌ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
-
Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!