Chicks with Cat: పిల్లి ఒడిలో కోడి పిల్లలు.. చూసి షాకైన తల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంటిలో చాలా మంది కొన్ని జంతువులను పెంచుకుంటూ ఉంటారు. సాధారణంగా పిల్లి, కుక్కను ఒకే చోట పెంచుకోలేరు. ఎందుకంటే అవి తరచూ గొడవపడుతూ ఉంటాయి. అదేవిధంగా కుక్కను, కోడిని, అదేవిధంగా పిల్లిని కోడిని కూడా ఒకేచోట పెంచుకోవడం చాలా సాహసంతో కూడుకున్న పని అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇవి ఒక చోటే ఉంటే కోడిని, వాటి పిల్లల్ని వెంటాడి చంపితినేయడం పక్కా. అది వాటి నేచర్ కూడా. అయితే కోడిపిల్లలను చూడగానే ఆహా దొరికింది ఈరోజు నాకు ఫుల్ మీల్స్ అనుకునే పిల్లి వాటిని తన ఒడిలో దాచుకున్నట్లు కనిపిస్తే చూడటానికి ఆశ్చర్యంగా ఉంటుంది కదా. వింత అనిపించినా అలాంటి వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
సోషల్ మీడియా వచ్చిన తరువాత ప్రపంచం నలుమూలల ఏ వింత జరిగినా క్షణాల్లోనే అంతా పాకిపోతుంది. తమకు కొత్తగా అనిపించిన విషయాలను సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. దీని ద్వారా చాలా ఆసక్తికరమైన విషయాలు రోజు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. వీటి చూసి వావ్ అనడం యూజర్ల వంతుగా మారుతుంది. ఇక అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చూసిన వారిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తమ పెంపుడు జంతువులు చేసే క్యూట్ క్యూట్ పనులను చూసి మురిసిపోతూ అవి చేసే పనులను చాలా మంది తమ సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ ఉంటారు. అటువంటి యూజర్ ఒకరు తమ ఇంట్లో ఉండే పిల్లి అక్కడే పెరిగే కోడిపిల్లలను అక్కునచేర్చుకున్న వీడియో ఒకదానిని రికార్డ్ చేసి పంచుకున్నారు.
Also Read
Also Read: Monkey Fight with Dog: పిల్లలను అన్నం తిననివ్వని తల్లి కుక్క.. కోపం వచ్చిన కోతి ఏం చేసిందంటే
ఈ వీడియోలో ఒక పిల్లి పిల్ల కింద కొన్ని కోడి పిల్లలు కూర్చొని ఉంటాయి. సాధారణంగా అలా ఉంటే ఆ పిల్లి ఆ కోడిపిల్లలను అమాంతం మింగేస్తుంది. కానీ ఆ పిల్లి మాత్రం వాటిని ఏం చేయలేదు. అయితే ఇది చూసిన ఆ తల్లి కోడి షాక్ కు గురవుతుంది. ఆ పిల్లి నిజంగా వాటి తల్లేమో అనేవిధంగా వాటిని ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం ఇది చూసిన నెటిజన్లు ఇదేందయ్యా ఇది నేనెప్పుడు చూడలేదు. ఇది నేచర్ కు విరుద్ధం కదా అని కామెంట్ చేస్తు్న్నారు. మరికొందరు ఇలాంటివి చూస్తే క్యూట్ అనిపిస్తోందంటూ మురిసిపోతున్నారు.
- Tags
- Cat
- chicks
- Mother Hen
- viral video
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..