Mother Dairy Hikes Milk Price : పెట్టుబడి ఖర్చులు పెరగడంతో మంగళవారం నుంచి ఢిల్లీ-ఎన్‌సీఆర్ మార్కెట్‌లో పాల ధరలను లీటరుకు రూ.2 చొప్పున పెంచాలని మదర్ డెయిరీ నిర్ణయించింది. రోజుకు 30 లక్షల లీటర్ల కంటే ఎక్కువ పరిమాణంలో ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని ప్రముఖ పాల సరఫరాదారులలో ఒకటైన మదర్ డెయిరీ ఈ ఏడాది పాల ధరలను పెంచడం ఇది ఐదోసారి. మదర్ డెయిరీ ఫుల్‌క్రీమ్ పాల ధరను లీటరుకు రూ.2 పెంచడంతో అది రూ.66కి చేరింది. టోన్డ్ మిల్క్ రేటు లీటరుకు రూ.51 నుంచి రూ. 53కి పెంచారు. డబుల్ టోన్డ్ మిల్క్ రేటు లీటరుకు రూ.45 నుండి రూ.47 కి చేరింది. ఆవు పాలు, టోకెన్ (బల్క్ వెండెడ్) పాల వేరియంట్‌ల ధరలను పెంచకూడదని మదర్ డెయిరీ నిర్ణయించింది.
Read Also: Omicron BF7 : మాస్క్ పెట్టాల్సిందే.. శానిటైజర్ పూసుకోవాల్సిందే.. ప్రజలకు సీఎం వార్నింగ్
పాల ధరల పెంపుతో సామాన్యుల గృహ బడ్జెట్‌పై ప్రభావం పడనుంది. పాడి రైతుల నుంచి కంపెనీకి ముడి పాల సేకరణ వ్యయం పెరగడమే ధరల పెంపునకు కారణమని మదర్ డెయిరీ పేర్కొంది. ముడి పాల సేకరణ ధరలు గత ఏడాది కంటే దాదాపు 24 శాతం పెరిగాయని కంపెనీ పేర్కొంది. పెరిగిన ధఱలు డిసెంబర్ 27 నుండి అమలులోకి రానున్నట్లు మదర్ డైరీ తెలిపింది. ఈ ఏడాదిలో కంపెనీ అనేక సార్లు పాల ధరలను పెంచింది. చివరిసారిగా నవంబర్ 21న ఫుల్‌క్రీమ్ పాల ధరలను లీటరుకు రూ.1, టోకెన్ పాల ధరలను లీటరుకు రూ.2 చొప్పున పెంచింది. అమూల్ బ్రాండ్‌తో పాలను విక్రయిస్తున్న గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (GCMMF) ఢిల్లీ-NCR మార్కెట్‌లో కూడా ప్రధాన పాత్ర పోషిస్తోంది. రోజుకు దాదాపు 40 లక్షల లీటర్లు విక్రయిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తిదారు అయిన భారతదేశంలో పాల ఉత్పత్తి సంవత్సరానికి 210-220 మిలియన్ టన్నులు.