NTV Telugu Site icon

Telangana: తెలంగాణలో 4 వేలకు పైగా నామినేషన్లు..

Nominations

Nominations

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఘట్టం ముగిసింది. నిన్నటితో నామినేషన్ల ప్రక్రియకు ముగింపు పలికారు. ఇక, ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు భారీ సంఖ్యలో స్వతంత్రులు నామినేషన్లు దాఖలు చేశారు. కొందరు క్యాండీడెట్స్ భారీ ర్యాలీలతో ఆర్‌ఓల ఆఫీసులకు వెళ్లి నామినేషన్‌ వేశారు. కొన్ని నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల నుంచి సీట్లు దక్కని వారు రెబల్స్‌గా కూడా పోటీ చేస్తున్నారు. అయితే, రాష్ట్రవ్యాప్తంగా 4355 మంది నామినేషన్లు వేశారు.

Read Also: CM YS Jagan: మైనారిటీలకు తొలిసారి రిజర్వేషన్లు కల్పించిన నేత వైఎస్‌.. నాన్న ఒక అడుగు వేస్తే.. మీ బిడ్డ రెండు అడుగులు వేశాడు

అయితే, తెలంగాణలో మొన్నటి వరకు కేవలం 2,474 నామినేషన్లు దాఖలు కాగా.. నిన్న ( శుక్రవారం ) చివరిరోజు 2327 పైగా నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఇక, గురువారం రోజున ప్రముఖ నేతలు ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసిన వివరాల ప్రకారం.. ఈ నెల 13వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అభ్యర్థులు 15వ తేదీలోపు తమ నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు అని తెలిపింది.

Read Also: PF Interest Credit: ఈపీఎఫ్‎వో ఖాతాదారులు గుడ్ న్యూస్.. అందరి ఖాతాల్లో డబ్బులు జమ

ఇక, మరోవైపు బీ-ఫామ్‌ సబ్మిట్‌కు సైతం గడువు ముగిసింది. బీ-ఫామ్‌ సమర్పించని అభ్యర్థుల్ని స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల సంఘం ప్రకటిస్తుంది. అలాగే నామినేషన్‌ సమయంలో వందకు పైగా అభ్యర్థులు ఇప్పటి వరకు అఫిడవిట్లు సమర్పించలేదు. దీంతో వాళ్లకు రిటర్నింగ్‌ ఆఫీసర్లు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. అయితే, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు 94 రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కలిపి 2,644 నామినేషన్లు దాఖలు అయ్యాయి. తాజా గణాంకాల ప్రకారం.. ఈసారి నామినేషన్ల సంఖ్య 4355 నమోదు అయింది.

Show comments