NTV Telugu Site icon

2,600 Flights Cancelled: పిడుగుల ఎఫెక్ట్‌.. 2600కి పైగా విమానాలు రద్దు, 8 వేల విమానాలు ఆలస్యం..

Flights

Flights

2,600 Flights Cancelled: ఓవైపు భారీ వర్షాలు, మరోవైపు పిడుగుల హెచ్చరికలతో ఏకంగా వేలలో విమానాలు రద్దు చేయాల్సిన పరిస్థితి అగ్ర రాజ్యానికి వచ్చింది.. అమెరికాలో ఉరుములు, మెరుపులతో కూడా భారీ వర్షం కురుస్తోంది. పిడుగులు కూడా పడుతున్నాయి.. దీంతో.. అమెరికా వ్యాప్తంగా 2,600 విమానాలు రద్దు చేశారు అధికారులు.. మరో 8 వేల విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. వీటిలో చాలా వరకు రద్దు చేయబడిన, ఆలస్యం అయిన విమానాలు ఈశాన్య ప్రాంతానికి చెందినవి. ఈశాన్య ప్రాంతం నుండి 1,320 విమానాలు సహా దేశవ్యాప్తంగా మొత్తం 2,600 విమానాలు రద్దు చేయబడ్డాయి. వాటిలో 350 విమానాలు న్యూజెర్సీ రాష్ట్రంలోని నెవార్క్ లిబర్టీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిలిచిపోయాయి. అయితే, ఈ వర్షం ప్రభావం ముఖ్యంగా జాన్ ఎఫ్ కెన్నెడీ మరియు లా గార్డియన్ విమానాశ్రయాలలో ఎక్కువగా ఉంటుంది.

Read Also: Pakistan: 150 ఏళ్ల నాటి హిందూ దేవాలయాన్ని కూల్చివేసిన పాకిస్థాన్

అమెరికా FlightAware డేటా ప్రకారం,జాన్ ఫిట్జ్‌గెరాల్డ్ కెన్నెడీ విమానాశ్రయంలో 318 విమానాలు పూర్తిగా రద్దు చేయబడ్డాయి. మరో 426 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. లాగ్వార్డియా విమానాశ్రయంలో 270 విమానాలు రద్దు చేయబడ్డాయి. మరో 292 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. అదేవిధంగా, బోస్టన్ లోగాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 259 విమానాలు పూర్తిగా రద్దు చేయబడ్డాయి. మరో 459 విమానాలు ఆలస్యమయ్యాయి. దీంతో అమెరికా వ్యాప్తంగా 2,600 విమానాలు రద్దయ్యాయి. మరో 8 వేల విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. వీటిలో చాలా వరకు ఈశాన్య ప్రాంతానికి చెందిన విమానాలే ఉన్నాయి.. ఈశాన్య ప్రాంతం నుండి 1,320 విమానాలు సహా దేశవ్యాప్తంగా మొత్తం 2,600 విమానాలు రద్దు చేయబడ్డాయి. వాటిలో 350 విమానాలు న్యూజెర్సీ రాష్ట్రంలోని నెవార్క్ లిబర్టీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిలిచిపోయాయి.