ఓవైపు భారీ వర్షాలు, మరోవైపు పిడుగుల హెచ్చరికలతో ఏకంగా వేలలో విమానాలు రద్దు చేయాల్సిన పరిస్థితి అగ్ర రాజ్యానికి వచ్చింది.. అమెరికాలో ఉరుములు, మెరుపులతో కూడా భారీ వర్షం కురుస్తోంది. పిడుగులు కూడా పడుతున్నాయి.. దీంతో.. అమెరికా వ్యాప్తంగా 2,600 విమానాలు రద్దు చేశారు అధికారులు.. మరో 8 వేల విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.