Brazil: అమెజాన్ ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఈ భూమి మీద అంతు చిక్కని ప్రదేశాలలో అమెజాన్ అడవి కూడా ఒకటి. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న అతి పెద్ద అడవి అమెజాన్ అడవి. ఈ అడవిలో ఎన్నో నిగూడ రహస్యాలు దాగి ఉన్నాయి. చూడడానికి ఎంతో అందంగా కనిపించే ఈ అడవి.. భూమి మీద అత్యంత ప్రమాదమైన ప్రదేశాలల్లో మొదటి స్థానంలో ఉంటుంది. అతి పెద్దదైన అనకొండ పాము కూడా ఈ అడవిలోనే ఉంటుంది. అంతు చిక్కని వన్యప్రాణులకు నిలయమైన ఈ అడవిలో ప్రస్తుతం మూగజీవులు విగత జీవులుగా మారుతున్నాయి. వివరాలకోకి వెళ్తే బ్రెజిల్‌లోని అమెజాన్‌లో గత ఏడు రోజుల్లో 100కు పైగా డాల్ఫిన్‌లు మరణించాయి. సరసు ఉష్టోగ్రత తీవ్రస్థాయిలో పెరగడం మరియు అక్కడ ఏర్పడిన తీవ్రమైన కరువు పరిస్థితుల కారణంగా డాల్ఫిన్‌లు మరణించి ఉండొచ్చని ఇన్‌స్టిట్యూట్ కాలిబ్రేట్ పేర్కొంటుంది.
Read also:Gandhi Jayanti: గాంధీజీని మొదటిసారి మహాత్మా అని పిలిచింది ఎవరో తెలుసా..!?
అమెజాన్ నదిలో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ క్రమంలో అమెజాన్ నది నివాసంగా బ్రతికే జంతవులు ప్రస్తుత అసాధారణ పరిస్థితులతో పోరాడుతున్నాయి. ఈ విపరీత పరిస్థితులు వాతావరణ శాస్త్రవేత్తలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పెరుగుతున్న ఉష్టోగ్రతలు మరియు కరువు నేపథ్యంలో నదిలోని డాల్ఫిన్ మరణాల సంఖ్య పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ విపరీతమైన వాతావరణ పరిస్థితుల వల్ల నదీ జంతుజాలం యొక్క జీవితం మాత్రమే కాకుండా, అమెజాన్ నదిలో సంభవిస్తున్న ఈ ఘోరమైన కరువు ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో ఈ విపత్తు నుండి డాల్ఫిన్‌లను రక్షించడానికి శాస్త్రవేత్తలు శాయశక్తులా కృషి చేస్తున్నారు. డాల్ఫిన్‌లను శివార్లలోని మడుగులు మరియు చెరువుల నుండి నది యొక్క ప్రధాన భాగంలోకి తరలించాలని శాస్త్రవేత్తలు చూస్తున్నారు. ఎందుకంటే అక్కడ నీరు సాపేక్షంగా చల్లగా ఉంటుంది. అందువల్ల డాల్ఫిన్‌లను రక్షించ వచ్చని భావిస్తున్నారు. కానీ.. ఆ ప్రాంతాలు చాలా దూరంలో ఉన్నందున ఆపరేషన్ అంత సులభం కాదని CNN బ్రెజిల్ నివేదిక స్పష్టం చేసింది.