Health benefits of Bitter Gourd: ప్రస్తుతం వర్షాకాలం సీజన్ నడుస్తోంది. ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు చాలా మందిని అటాక్ చేస్తాయి. ఈ సీజన్‌లో ప్రజలు తరచుగా అనారోగ్యానికి గురవుతుంటారు. జ్వరం, జలుబుతో పాటు జీర్ణక్రియ సమస్యలను ఎదుర్కొంటారు. ఇందుకోసం రకరకాల మందులు తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాధులను నివారణకు మందులు పనిచేస్తాయి కానీ.. వర్షాకాలంలో వచ్చే అన్ని రకాల డీసీసెస్ నుంచి మీకు ఉపశమనం కలిగించే ఓ ఔషధం ఉంది. అదే కాకరకాయ. ఇది చేదుగా అనిపించవచ్చు కానీ.. దాని ఆరోగ్య ప్రయోజనాలు అపారమైనవి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అనేక పోషకాలు ఉండే కాకరకాయను వర్షాకాలంలో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తీసుకోవాలి. కాకరకాయ మిమ్మల్ని ఫిట్‌గా ఉంచడానికి, మీ చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది. కాకరకాయను వర్షాకాలంలో మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఆ ప్రయోజనాలను మీరే చూడండి.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
వర్షాకాలంలో తరచుగా జలుబు, ఫ్లూ, ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కాకరకాయలో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవన్నీ యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఇవన్నీ ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడతాయి. ఈ పోషకాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. దాంతో వ్యాధులు మీ దరిచేరవు.
రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది:
కాకరకాయలో చరాన్టిన్, పాలీపెప్టైడ్-పి, వైసిన్ వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఇన్సులిన్‌ను అనుకరిస్తాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి. ఇది డయాబెటిస్ లేదా ప్రీడయాబెటిస్ ఉన్న వారికి బాగా ఉపయోగపడుతాయి. రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంచడానికి కాకరకాయ సహాయపడుతుంది.
Also Read: Rishabh Pant: మరో 40 పరుగులే.. నంబర్-1 బ్యాటర్‌గా చరిత్ర సృష్టించనున్న పంత్!
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
కాకరకాయలో ఫైబర్, నీరు అధికంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. కాకరకాయ మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇది జీర్ణక్రియను, కొవ్వుల నిర్విషీకరణను మెరుగుపరుస్తుంది.
చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది:
వర్షాకాలంలో తేమ తరచుగా మొటిమలు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు చికాకును తెప్పిస్తాయి. కాకరకాయలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడతాయి. చర్మాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి.
కాలేయ రక్షణ:
వర్షాకాలంలో ఎక్కువగా ఆహారం తీసుకోవడం వల్ల కాలేయంపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ పరిస్థితిలో కాకరకాయ పిత్త స్రావాన్ని ప్రోత్సహిస్తుంది. కాలేయం యొక్క నిర్విషీకరణ విధులను పెంచుతుంది. దీని సమ్మేళనాలు కాలేయ కణాలను కూడా రక్షించగలవు.