Mokshajna : ఫైనల్‌గా నందమూరి నటసింహం వారసుడు రంగంలోకి దిగిపోయాడు. బాలయ్య తనయుడు మోక్షజ్ఙ కొత్త సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. హనుమాన్‌తో సూపర్ డూపర్ హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మ.. మోక్షుని లాంచ్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. అన్‌స్టాపబుల్ షో ద్వారా బాలయ్యతో ప్రశాంత్‌కి మంచి రాపో ఏర్పడింది. వాస్తవానికైతే.. బాలయ్యతోనే ప్రశాంత్ వర్మ సినిమా ఉంటుందని వినిపించింది. కానీ బాలయ్య మాత్రం మోక్షుతో సినిమా ప్లాన్ చేశాడు.. సినిమా కూడా అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో మోక్షజ్ఙ అదిరిపోయాడు. పర్ఫెక్ట్ హీరో కటౌట్‌తో నందమూరి ఫ్యాన్స్‌ను ఖుషీ చేశాడు. అయితే.. గతంలో మోక్షు ఇలా లేడు. కాస్త బొద్దుగా ఉండేవాడు. దీంతో.. బాలయ్య వారసుడు హీరో అవుతాడా? లేదా? అనే సందేహాలు కూడా వెలువడ్డాయి.
Read Also:Viran Muttamsetty : అల్లు అర్జున్ కజిన్ విరాన్ ముత్తంశెట్టి హీరోగా ఓ సినిమా..
కానీ ఇప్పుడు సాలిడ్ లుక్‌లోకి వచ్చేశాడు మోక్షు. మరి బొద్దుగా ఉన్న మోక్షు.. హీరో కటౌట్‌లోకి రావడానికి ఎంత వెయిట్ లాస్ అయ్యాడు? అంటే, దాదాపు 18 కేజీ బరువు తగ్గినట్టుగా తెలుస్తోంది. హీరోగా మారాలని డిసైడ్ అయిన మోక్షజ్ఞ, ఫిట్‌నెస్‌పైన పూర్తి ఫోకస్ పెట్టాడు. దీంతో.. ఐదారు నెలల్లోనే భారీగా బరువు తగ్గినట్టుగా చెబుతున్నారు. ఇప్పుడు.. ఈ కటౌట్ చూసి బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక బాలయ్య వారసుడు రాక కోసం ఎదురు చూస్తున్న అభిమానులు.. ఫస్ట్ లుక్ బయటికి రావడమే లేట్ అన్నట్టుగా.. భారీ కటౌట్‌లు ఏర్పాట్లు చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక 30 ఏళ్ల వయసులో హీరోగా ఎంట్రీ ఇస్తున్న మోక్షజ్ఞ, ఫస్ట్ సినిమానే సోషియో ఫాంటసీ కథను ఎంచుకున్నాడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా ఈ సినిమా రాబోతోంది. మరి మోక్షుని ప్రశాంత్ వర్మ ఎలా ప్రజెంట్ చేస్తాడో చూడాలి.
Read Also:Boeing Starliner: ఖాళీగా భూమికి తిరిగొచ్చిన స్టార్‌లైనర్.. అంతరిక్షంలోనే సునీతా విలియమ్స్..?