Mojtaba Khamenei: మోజ్తబా ఖమేనీ అరుదైన వీడియో విడుదల.. అనుమానాల వేళ వైరల్
- మోజ్తబా ఖమేనీ అరుదైన వీడియో విడుదల
- అనుమానాల వేళ వైరల్
- పాతదా? కొత్తదా? తేలాల్సి ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ ఆరోగ్యంపై ఎన్నో ఊహాగానాలు వచ్చాయి. కొందరు తీవ్రంగా గాయపడ్డారని.. ఇంకొందరు ఆస్పత్రిలో కోలుకుంటున్నారని రకరకాలైన పుకార్లు వచ్చాయి. ఇటీవల తండ్రి అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు కూడా హాజరుకాకపోవడంతో అనేక రకాలైన అనుమానాలు రేకెత్తాయి. అసలు బ్రతికున్నారా? లేదా? సందేహాలు వచ్చాయి. తాజాగా మోజ్తబా ఖమేనీకి చెందిన ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. దీంతో ఆయన ఆరోగ్యంపై అనుమానాలు వీడుతున్నాయి.
ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా అలీ ఖమేనీకి సంబంధించిన అరుదైన వీడియోను విడుదల చేసింది. గత కొంతకాలంగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై పలు వార్తలు, అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ వీడియో విడుదల కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read
- Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
- H-1B Visa: భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ షాక్.. హెచ్-1బీ వీసా రుసుము భారీగా పెంపు..
- Strait of Hormuz: హోర్ముజ్‌పై ఇరాన్ కొత్త ప్లాన్.. ప్రపంచ దేశాలకు బిగ్ షాక్..
- Jinping: భారీ బృందంతో ఢిల్లీకి వస్తున్న చైనా అధ్యక్షుడు.. బ్రిక్స్‌లో పాల్గొననున్న జిన్‌పింగ్
ఇరాన్‌కు చెందిన ఫార్స్ న్యూస్ ఏజెన్సీ ఈ వీడియోను విడుదల చేసింది. అయితే ఈ వీడియో ఎప్పుడు చిత్రీకరించారనే విషయాన్ని వెల్లడించలేదు. సుమారు 56 ఏళ్ల మోజ్తబా ఖమేనీ ఓ మతపరమైన అకడమిక్ అధ్యయన సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నట్లు వీడియోలో కనిపించారు. ఓ విద్యార్థి తన థీసిస్‌ను సమర్పిస్తుండగా ఆయన దానిని వింటూ.. అనంతరం ఆ పరిశోధనను మూల్యాంకనం చేశారు.
విద్యార్థికి 19.5 మార్కులు
వీడియోలో మోజ్తబా ఖమేనీ విద్యార్థి సమర్పించిన థీసిస్‌కు 20 మార్కులకు 19.5 మార్కులు ఇచ్చారు. ఆ పరిశోధనను “లోపాలు లేనిది”గా అభివర్ణించారు. అలాగే ఇరాన్ పాలనా వ్యవస్థకు సంబంధించిన “ఇస్లామిక్ సెక్యూరిటీ మోడల్”పై కూడా ఆయన చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ఈ వీడియో ఎప్పుడు చిత్రీకరించారనే దానిపై స్పష్టత లేదు. ఘర్షణ ప్రారంభమైనప్పటి నుంచి మోజ్తబా ఖమేనీ బహిరంగంగా పెద్దగా కనిపించకపోవడంతో ఈ వీడియోపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది.
దాడుల్లో తీవ్రంగా గాయపడ్డారా?
ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి జరిపిన దాడుల్లో మోజ్తబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారని గతంలో పలు కథనాలు వెలువడ్డాయి. ఈ దాడుల్లో ఆయన తండ్రి, ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించారు. అనంతరం మోజ్తబా ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టారు. దాడుల్లో మోజ్తబా ముఖం, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. ఏప్రిల్‌లో రాయిటర్స్ వెల్లడించిన కథనం ప్రకారం.. టెహ్రాన్‌లోని సుప్రీం లీడర్ సముదాయంపై జరిగిన దాడిలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఒకటి లేదా రెండు కాళ్లకు గణనీయమైన గాయాలు అయినట్లు సమాచారం. అయితే గాయాల నుంచి ఆయన కోలుకుంటున్నారని, మానసికంగా మాత్రం పూర్తి స్పష్టతతో ఉన్నారని ఆ నివేదిక పేర్కొంది. ఉన్నతాధికారులతో ఆడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశాల్లో పాల్గొంటున్నారని, అమెరికాతో యుద్ధం, చర్చలు వంటి కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోవడంలో భాగస్వామ్యం అవుతున్నారని తెలిపింది.
అనుమానాల వేళ వీడియో
తాజాగా విడుదలైన వీడియో మోజ్తబా ఖమేనీ బహిరంగ కార్యకలాపాలకు సంబంధించిన అరుదైన దృశ్యాలను అందిస్తోంది. ఆయన మతపరమైన, అకడమిక్ కార్యక్రమాల్లో కొనసాగుతున్నారనే సంకేతాన్ని ఇది సూచిస్తోంది. అయితే వీడియో పాతదా, ఇటీవలిదా అనే విషయం స్వతంత్రంగా నిర్ధారించలేకపోవడంతో ఆయన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై పూర్తి స్పష్టత రాలేదు.
మరోవైపు అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. వాషింగ్టన్.. ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచుతోంది. ఇరాన్ అంతర్జాతీయ ఆర్థిక సంబంధాలు, ఆదాయ వనరులను లక్ష్యంగా చేసుకుని కొత్త ఆంక్షల కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ ప్రకటించారు. ఇరాన్‌తో ఆర్థిక సంబంధాలను కొనసాగించే దేశాలు, సంస్థలు కూడా సెకండరీ ఆంక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా హెచ్చరిస్తోంది. మరోవైపు హార్ముజ్ జలసంధి కూడా ఇరు దేశాల మధ్య ప్రధాన వివాదాంశంగా కొనసాగుతోంది. ప్రపంచ చమురు, గ్యాస్ రవాణాలో కీలకమైన ఈ మార్గం విషయంలో ఉద్రిక్తతలు అంతర్జాతీయంగా ఆందోళనకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మోజ్తబా ఖమేనీకి సంబంధించిన అరుదైన వీడియో విడుదల కావడం.. ఆయన ఆరోగ్యం, బహిరంగ పాత్ర, ఇరాన్ కీలక నిర్ణయాల్లో ఆయన ప్రమేయంపై మరోసారి చర్చకు దారితీసే అవకాశం ఉంది.
Iran’s Supreme Leader Mojtaba Khamenei in FIRST-TIME-SEEN footage
Released publicly for the first time by Iranian media, footage shows him presiding over a religious academic study session pic.twitter.com/iIIl0pLAgS
— RT Intl (@RT_on_X) August 24, 2026
తాజావార్తలు
-
Mojtaba Khamenei: మోజ్తబా ఖమేనీ అరుదైన వీడియో విడుదల.. అనుమానాల వేళ వైరల్
-
Shiva Nirvana: డ్యాన్స్ మాస్టర్ శివ నిర్వాణ గురించి మీకు తెలుసా? ‘ఇరుముడి’ సినిమాలో ఆయన కొరియోగ్రఫీ చేసిన పాట ఇదే!
-
Mahesh Babu – Anil Ravipudi :వారణాసి తర్వాత అనిల్ రావిపూడితో మహేష్ సినిమా.. నిజమేనా?
-
Prasidh Krishna: మేము బాగా బౌలింగ్ చేస్తే సరిపోదు.. ప్రసిద్ధ్ కృష్ణ కీలక వ్యాఖ్యలు!
-
Balloon Stuck in Throat: బెలూన్ ఊదుతుండగా విషాదం.. గొంతులో ఇరుక్కుని ఆరేళ్ల బాలుడు మృతి
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!