Moinabad Episode: ఎమ్మెల్యేలకు బేరసారాల కేసు… రిమాండ్ రిపోర్టులో ఏముంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణతో పాటు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన అంశం మొయినాబాద్ ఫాంహౌస్ ఎపిసోడ్ (Moinabad Episode). ఎమ్మెల్యేలకు బేరసారాల కేసు రిమాండ్ నివేదికలో కీలక అంశాలు పేర్కొన్నారు పోలీసులు. ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు ఎమ్మెల్యేలకు ప్రలోభాలు చూపిన కేసుగా తెలిపారు పోలీసులు. మొయినాబాద్ ఫాం హౌస్ లో నాలుగు రహస్య కెమెరాలు, రెండు వాయిస్ రికార్డర్లు వాడినట్లు కోర్టుకు తెలిపారు పోలీసులు. హాల్ లో రహస్య కెమెరాలు, రోహిత్ రెడ్డి కుర్తా జేబుల్లో రెండు వాయిస్ రికార్డర్లు ఉంచామన్నారు పోలీసులు.
రోహిత్ రెడ్డి ఫాంహౌజ్ హాళ్లో మ.3.05కి రహస్య కెమెరాలు ఆన్ చేశాం అని వివరించారు పోలీసులు. మ.3.10కి నిందితులతో కలిసి హాళ్లోకి రోహిత్ రెడ్డి వచ్చారని వెల్లడించారు. సా.4.10కి గువ్వల బాలరాజు, హర్షవర్దన్ రెడ్డి, రేగా కాంతరావు వచ్చారన్నారు పోలీసులు. సుమారు మూడున్నర గంటల పాటు నిందితులతో ఎమ్మెల్యేలు చర్చించారు. మీటింగ్ పూర్తి కాగానే కొబ్బరి నీళ్లు తీసుకురా అని సిగ్నల్ ఇవ్వాలని రోహిత్ రెడ్డికి తాము చెప్పాం అన్నారు పోలీసులు. పోలీసులు చెప్పినట్టుగానే జరిగింది. కొబ్బరినీళ్లు తీసుకురా అని పైలట్ రోహిత్ రెడ్డి అనగానే లోనికి వెళ్లారు పోలీసులు.
Also Read
- UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
- RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
- BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 ఇస్తామన్న సంభాషణ వాయిస్ రికార్డర్లలో నమోదైందన్నారు పోలీసులు. కర్ణాటక, ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లోనూ చేశామన్న రామచంద్రభారతి సంభాషణ రికార్డయిందన్నారు. తుషార్ కు రామచంద్రభారతి ఫోన్ చేసినట్లు వాయిస్ రికార్డర్ లో రికార్డయింది. తెలంగాణకు సంబంధించి ముఖ్య విషయం మాట్లాడాలని సునీల్ కుమార్ బన్సల్ కు రామచంద్రభారతి ఎస్ఎంఎస్ పంపారన్నారు. ఎస్ఎంఎస్ స్క్రీన్ షాట్ ను రిమాండ్ నివేదికలో పొందుపరిచారు పోలీసులు.
Read Also: Shoib Akthar: అక్తర్ నోటి దురుసు.. వచ్చేవారం ఇండియా కూడా ఇంటికి రావడం ఖాయం
రామచంద్ర భారతి, నందు వాట్సప్ సంభాషణ స్క్రీ్న్ షాట్లు పొందుపరిచారు పోలీసులు. 25 మంది చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటు “సంతోష్ బీజేపీ” పేరుతో ఉన్న నంబరుకు రామచంద్ర భారతి వాట్సప్ మెసేజ్ పొందుపరిచారు పోలీసులు. నందు డైరీలో 50 మంది తెరాస, కాంగ్రెస్ ఎమ్మెల్యేల వివరాలున్నాయని రిమాండ్ నివేదికలో పేర్కొన్నారు పోలీసులు. మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు రోహిత్ రెడ్డికి సహకరించేందుకు వెళ్లారన్నారు.
Read Also: Shoib Akthar: అక్తర్ నోటి దురుసు.. వచ్చేవారం ఇండియా కూడా ఇంటికి రావడం ఖాయం
తాజావార్తలు
-
Harish Rao : రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రాక్షస రాజ్యం వచ్చింది
-
UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
-
RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో గణపయ్య సందడి.. క్యూలైన్లన్నీ ఫుల్.!
-
BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!