Site icon NTV Telugu

Mohsin Naqvi: నఖ్వీ నాటకాలు.. రహస్య ప్రదేశానికి ఆసియా కప్ 2025 ట్రోఫీ!

Mohsin Naqvi Bcci

Mohsin Naqvi Bcci

భారత్, పాకిస్థాన్‌ మధ్య ఆసియా కప్‌ 2025 ట్రోఫీ వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. ట్రోఫీ కాంట్రవర్సరీ రోజురోజుకూ పెరుగుతుందే తప్ప.. సమస్యకు పులిస్టాప్ పడడం లేదు. అటు పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డు (పీసీబీ), ఇటు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తగ్గేదేలే అంటుండడంతో సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. ఇందుకు ప్రధాన కారణం ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చీఫ్, పీసీబీ చైర్మన్ మోసిన్‌ నఖ్వీనే. నఖ్వీ నాటకాల కారణంగా ఫైనల్ ముగిసి దాదాపు నెల రోజులు కావస్తున్నా ఇంతవరకు ట్రోఫీ భారత్‌కు చేరలేదు. తాజాగా ఆసియా కప్‌ ట్రోఫీ గురించి మరో న్యూస్ చక్కర్లు కొడుతోంది.

Also Read: Akhanda 2 Thaandavam: ఎలా నరుకుతానో నాకే తెలియదు కొడకా.. ఊహక్కూడా అందదు!

ఆసియా కప్‌ 2025 ట్రోఫీని ఏసీసీ హెడ్‌క్వార్టర్స్‌ నుంచి అబుదాబిలోని గుర్తు తెలియని ప్రాంతానికి మోసిన్‌ నఖ్వీ తరలించాడని నెట్టింట వార్తలు వస్తున్నాయి. బీసీసీఐకి చెందిన ఓ అధికారి తాజాగా ఏసీసీ కార్యాలయాన్ని సందర్శించగా.. అక్కడ ట్రోఫీ కనిపించలేదట. ప్రస్తుతం నఖ్వీ స్వాధీనంలో అబుదాబిలోని ఓ రహస్య ప్రదేశంలో ట్రోఫీ ఉందట. కొందరు వ్యక్తుల ద్వారా సదరు బీసీసీఐ అధికారి ఈ విషయాన్ని తెలుసుకున్నాడట. నఖ్వీ కుట్రలతో ప్రస్తుతం పరిస్థితి మరింత సున్నితంగా మారింది. బీసీసీఐ అధికారి లేదా టీమిండియా ఆటగాడు వస్తేనే ట్రోఫీని నేరుగా అప్పగిస్తామని నఖ్వీ మొండిపట్టు పడుతున్నాడు. బీసీసీఐ మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. ఐసీసీకి ఫిర్యాదు చేయడానికి బీసీసీఐ సిద్ధముగా ఉంది.

Exit mobile version