L2E Empuraan Teaser : మాలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్ సినిమాలకు మలయాళంలోనే కాకుండా ఇతర భాషల్లో కూడా మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆయన సినిమాలు తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటాయి. మోహన్ లాల్ లూసిఫర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కింది. లూసిఫర్ సినిమాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి.. గాడ్ ఫాదర్ పేరుతో తీశారు. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ గాడ్ ఫాదర్ సినిమాలో గెస్ట్ రోల్ లో నటించారు. అయితే, ఈ సినిమా ఆశించినంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు లూసిఫర్ సినిమాకు సీక్వెల్ తీస్తున్నారు.
Read Also:Minister Savita: హాస్టల్ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఊరుకోం.. మంత్రి హెచ్చరిక
లూసిఫర్ రెండో భాగం ‘ఎంపురాన్’ విడుదల తేదీని గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. దర్శకుడు పృథ్వీరాజ్ తన సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. దీనితో ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. లూసిఫర్ ఫ్రాంచైజీలో రెండవ సినిమా అయిన ఎంపురాన్ మార్చి 27, 2025న థియేటర్లలోకి వస్తుందని మేకర్స్ ఆల్రెడీ ప్రకటించారు. ఈ భారీ సీక్వెల్ కి గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. మరి ఈ టీజర్ గ్లింప్స్ మాత్రం మొదటి సినిమా కథకి కొనసాగింపుతోనే మరో లెవెల్లోకి తీసుకెళ్లేలా ఉందనే చెప్పాలి.
Read Also:Yogi Adityanath: ‘‘సనాతన ధర్మం జాతీయ మతం’’..సీఎం యోగి కీలక వ్యాఖ్యలు..
ఊహించని రేంజ్ విజువల్స్ తో పృథ్వీ రాజ్ అదరగొట్టేశారు. ఇంకా సుజీత్ వాసుదేవ్ ఇచ్చిన సినిమాటోగ్రఫీ ఇంకా దీపక్ దేవ్ ల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ టీజర్ లో అదనపు ఆకర్షణ అని చెప్పవచ్చు. మరి మొత్తానికి అయితే ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అనే చెప్పాలి. మార్చ్ 27న పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాబోతుంది.