మెగాస్టార్ చిరంజీవి – బాబీ కొల్లి కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలవడంతో ఇప్పుడు మరోసారి ఈ సూపర్ హిట్ కాంబో రిపీట్ అవుతుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే, ఈ సినిమాలో మలయాళ కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ ఈ చిత్రంలో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. లాలెట్టని కలిసి కథ వినిపించగా వెంటనే అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఇది కేవలం అతిథి పాత్రలా కాకుండా, కథను మలుపు తిప్పే అత్యంత ప్రాధాన్యత కలిగిన పాత్రలో ఆయన మెరవనున్నారట.
Also Read : Vijay – Rashmika Wedding : రష్మిక – విజయ్ దేవరకొండల పెళ్లి డేట్ ఇదే..
చిరంజీవి, మోహన్ లాల్ వంటి ఇద్దరు స్టార్స్ ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే ఫ్యాన్స్ కు అది ఫుల్ మీల్స్ ఇచ్చినట్టే అవుతుంది. అందుకు తగ్గట్టే వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు హై ఓల్టేజ్ డ్రామాతో ప్లాన్ చేసాడట బాబీ. మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు బాబీ ఈ సారి మెగాస్టార్‌ను ఏ రేంజ్లో చూపిస్తే ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతారో ఆయనకు బాగా తెలుసు. ఇక చిరంజీవికి తోడుగా మోహన్ లాల్‌ను రంగంలోకి దించడం ద్వారా ఈ ప్రాజెక్ట్‌కు పాన్-ఇండియా అప్పీల్ కూడా తీసుకువస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఇద్దరు లెజెండరీ నటుల కలయిక సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్ కానుంది.ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. దీనిపై చిత్ర యూనిట్ నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరి చిరు – మోహన్ లాల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉండబోతుందో చూడాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే!