Mohanlal Indian Army Honour: మలయాళ సూపర్ స్టార్, ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ (గౌరవ) మోహన్ లాల్‌కు అరుదైన గౌరవం లభించింది. సమాజానికి ఆయన చేసిన విశేష సేవకు, సైన్యంతో నిరంతర ప్రమేయానికి గాను ఆయనను మంగళవారం భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సత్కరించారు. అనంతరం మోహన్‌లాల్‌కు ఆర్మీ చీఫ్.. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ అవార్డు మోహన్ లాల్ సేవా స్ఫూర్తి, దాతృత్వం, దేశ యూనిఫాం పట్ల ఆయనకు ఉన్న గౌరవాన్ని ప్రతిబింబిస్తుంది.
సైన్యంతో మోహన్ లాల్‌కు అనుబంధం..
మోహన్ లాల్‌కు మే 2009 లో టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ గౌరవ హెూదా లభించింది. నాటి నుంచి ఆయన సైన్యంతో అనుబంధం కలిగి ఉన్నారు. ఆయన నిరంతరం సేవ, క్రమశిక్షణ, దేశభక్తి విలువలను పాటిస్తారు. సైన్యంతో అనుబంధం కలిగి ఉండటం తనకు గర్వకారణమని మోహన్ లాల్ చాలా సందర్భాల్లో పేర్కొన్నారు. నాటి నుంచి ఆయన తరచుగా ఆర్మీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఆగస్టు 2024లో వయనాడ్‌లో సంభవించిన ప్రకృతి వైపరీత్యం కారణంగా చేపట్టిన సహాయక చర్యల్లో ఆయన ప్రత్యక్షంగా పాల్గొని సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన స్వయంగా సహాయ చర్యలలో పాల్గొని, బాధిత ప్రజలకు ఆహారం, మందులు అందించారు.
విశ్వ శాంతి ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు..
మోహన్ లాల్ సినిమా హీరో మాత్రమే కాదని, రియల్ హీరో అని జనాలు చెబుతారు. ఆయన సినిమాలతో పాటు, సామాజిక సేవల ద్వారా కూడా ప్రసిద్ధి చెందారు. ఆయన విశ్వ శాంతి ఫౌండేషన్ విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, సంక్షేమంపై విశేషంగా పనిచేస్తుంది. ఈ ఫౌండేషన్ భారతదేశం అంతటా లక్షలాది మందికి సహాయం చేస్తుంది. సినిమా ద్వారా వచ్చే ఆదాయాన్ని సమాజానికి తిరిగి ఇవ్వడం తన కర్తవ్యమని మోహన్ లాల్ చెబుతున్నారు. ఈ ఫౌండేషన్ పాఠశాలలు, ఆసుపత్రులు, చెట్ల పెంపకం వంటి ప్రాజెక్టులను ప్రారంభించింది.
ఈరోజు ఆర్మీ చీఫ్ మోహన్ లాల్‌కు ఆయన చేసిన సేవలకు ప్రత్యేక గౌరవంగా ప్రశంస పత్రాన్ని అందజేశారు. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కమెండేషన్ కార్డ్ అనేది సేవ, అంకితభావాన్ని గుర్తించే ప్రతిష్టాత్మక అవార్డు. మోహన్ లాల్ యూనిఫాంకు గౌరవం తెచ్చారని ఆర్మీ చీఫ్ అన్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమం ఆర్మీ ప్రధాన కార్యాలయంలో జరిగింది.
READ ALSO: UGC NET December 2025: యూజీసీ నెట్ డిసెంబర్ నోటిఫికేషన్ విడుదల..