UGC NET December 2025: దేశ వ్యాప్తంగా ఎంతో మంది విద్యార్థులు, అభ్యర్థులు ఎదురు చూస్తున్న యూజీసీ నెట్ డిసెంబర్ నోటిఫికేషన్ మంగళవారం విడుదలైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ( NTA ) UGC NET డిసెంబర్ 2025 పరీక్ష కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ను అక్టోబర్ 7వ తేదీన ప్రారంభించింది. ఆసక్తిగల అభ్యర్థులు NTA అధికారిక వెబ్‌సైట్ https://ugcnet.nta.nic.in ను సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు. యూజీసీ నెట్ దరఖాస్తుకు చివరి తేదీ, అర్హత, దరఖాస్తు రుసుము వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Russia: పాకిస్తాన్‌కు రష్యా జెట్ ఇంజన్లు ఇచ్చినా భారత్‌కే లాభం.. ఎలాగంటే..
చివరి తేదీ ఎప్పుడంటే..
యూజీసీ నెట్ డిసెంబర్ నోటిఫికేషన్‌ను దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ 7, 2025 ( రాత్రి 11:50 గంటలకు ). దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు అర్హత ప్రమాణాలు, పరీక్ష రుసుము, సబ్జెక్ట్ జాబితా, పరీక్షా విధానం, ఇతర ముఖ్యమైన సూచనలను కలిగి ఉన్న అధికారిక సమాచార బులెటిన్‌ను జాగ్రత్తగా చదవాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సూచించింది. అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) సాధించడానికి అభ్యర్థుల అర్హతను నిర్ణయించడానికి NTA UGC – NET పరీక్షను ఏటా రెండు సార్లు నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాలలో ఈ పరీక్ష కంప్యూటర్ ఆధారిత పరీక్ష ( CBT) పద్ధతిలో నిర్వహించనున్నారు.
ఇబ్బంది ఎదురైతే..
UGC –NET డిసెంబర్ 2025 కి దరఖాస్తు చేసుకోవడంలో అభ్యర్థికి ఏదైనా ఇబ్బంది ఎదురైతే, తక్షణం సహాయం కోసం క్రింద పేర్కొన్న ఛానెల్‌ల ద్వారా సంప్రదించవచ్చని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ( NTA ) సూచించింది. ఫోన్ నంబర్: 011-40759000 / 011-69227700, ఇమెయిల్: ugcnet@nta.ac.in ద్వారా సంప్రదించాలని తెలిపింది. అభ్యర్థుల ఇబ్బందులను తెలిపి సమస్యలను పరిష్కరించుకోవాలని పేర్కొంది. UGC –NET డిసెంబర్ 2025 కి సంబంధించిన వివరణ లేదా సహాయం కోసం మాత్రమే వీటిని ఉపయోగించాలని ప్రత్యేకంగా తెలిపింది.
READ ALSO: Himachal Bus Landslide: హిమాచల్ ప్రదేశ్‌లో ఘోరం.. బస్సుపై కొండచరియలు విరిగిపడి 15 మంది మృతి