Mohammed Siraj Captain: కెప్టెన్‌గా మహ్మద్ సిరాజ్!
- హైదరాబాద్ కెప్టెన్‌గా మహ్మద్ సిరాజ్
- ముంబై, చత్తీస్‌గఢ్ మ్యాచ్‌లకు కెప్టెన్‌గా సిరాజ్
- 15 మందితో కూడిన హైదరాబాద్ జట్టు ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు శుభవార్త. భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా నియమితులయ్యాడు. రంజీ ట్రోఫీ 2026లో హైదరాబాద్ జట్టుకు అతడు సారథ్యం వహించనున్నాడు. ముంబై, చత్తీస్‌గఢ్‌లతో జరిగే రంజీ మ్యాచ్‌లకు సిరాజ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) తెలిపింది. 15 మందితో కూడిన హైదరాబాద్ జట్టును బుధవారం సీనియర్ సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది.
ఇప్పటికే టీమిండియాలో కీలక పేసర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మహ్మద్ సిరాజ్.. ఇప్పుడు నాయకత్వ పాత్రలోకి అడుగుపెట్టాడు. తన అనుభవం, క్రమశిక్షణ, పోరాట తత్వంతో హైదరాబాద్ జట్టును విజయపథంలో నడిపిస్తాడని హెచ్‌సీఏ సెలెక్టర్లు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా యువ ఆటగాళ్లకు సిరాజ్ నాయకత్వం ఎంతో ఉపయోగపడుతుందని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Also Read
- Trump: ఇరాన్‌తో చర్చలు బాగున్నాయి.. ఖతార్ భేటీపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే 'ఫ్లఫీ ఆమ్లెట్' చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
- Iran: ఖమేనీ అంత్యక్రియలకు ప్రతిపక్ష కాంగ్రెస్‌కు ఆహ్వానం.. ఎవరు వెళ్లనున్నారంటే..!
- Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
హైదరాబాద్ తరఫున మహ్మద్ సిరాజ్ గతంలో కీలక మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఇప్పుడు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడంతో.. ఆటతో పాటు వ్యూహాత్మక నిర్ణయాల్లోనూ తన సత్తా చాటే అవకాశం వచ్చింది. బౌలింగ్ యూనిట్‌ను సమర్థంగా నడిపిస్తూ జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో ఆయన పాత్ర కీలకంగా ఉండనుంది. మొత్తానికి హైదరాబాద్ కెప్టెన్‌గా సిరాజ్ నియామకం జట్టుకు కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చింది. రానున్న దేశవాళీ సీజన్లో హైదరాబాద్ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని అభిమానులు భావిస్తున్నారు.
Also Read: NTV journalists: సీసీఎస్ పోలీసుల హైడ్రామాకు తెర.. జర్నలిస్టులు దొంతు రమేష్, సుధీర్‌కు బెయిల్!
హైదరాబాద్ జట్టు:
మహ్మద్ సిరాజ్ (కెప్టెన్), రాహుల్ సింగ్ (వైస్ కెప్టెన్), సివి మిలింద్, తనయ్ త్యాగరాజన్, రోహిత్ రాయుడు, హిమతేజ, వరుణ్ గౌడ్, అభిరథ్ రెడ్డి, రాహుల్ రాదేశ్ (కీపర్), అమన్‌రావు పేరాల, రక్షణ్ రెడ్డి, నితిన్ సాయియాదవ్, నితేష్ రెడ్డి, సాయి ప్రజ్ఞయ్ రెడ్డి (కీపర్), పున్నయ్య.
స్టాండ్‌బై ప్లేయర్స్: మికిల్ జైశ్వాల్, అవినాష్ రావు (కీపర్), కార్తికేయ, ప్రణవ్ వర్మ, నితీశ్ రెడ్డి.
తాజావార్తలు
-
Trump: ఇరాన్‌తో చర్చలు బాగున్నాయి.. ఖతార్ భేటీపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Ramayan Leak: రణబీర్ కపూర్ ‘రామాయణం’ లీక్? ఆ 11 సెకన్ల క్లిప్ చూసి తలబాదుకుంటున్న ఫ్యాన్స్!
-
Adani Ports: రూ.13,225 కోట్ల మెగా డీల్.. అదానీ షేర్ కొనేందుకు ఎగబడుతున్న ఇన్వెస్టర్లు! ఆ షేర్ ఏదో తెలుసా?
-
Iran: ఖమేనీ అంత్యక్రియలకు ప్రతిపక్ష కాంగ్రెస్‌కు ఆహ్వానం.. ఎవరు వెళ్లనున్నారంటే..!
ట్రెండింగ్
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్‌తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్‌ను ఈజీగా బుట్టలో వేస్తాం!