Adani Ports: రూ.13,225 కోట్ల మెగా డీల్.. అదానీ షేర్ కొనేందుకు ఎగబడుతున్న ఇన్వెస్టర్లు! ఆ షేర్ ఏదో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adani Ports: స్టాక్ మార్కెట్లో బుధవారం నాటి ట్రేడింగ్ అదానీ గ్రూప్ ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించింది. గ్రూప్‌లోని అత్యంత కీలకమైన షేర్ అదానీ పోర్ట్స్ (Adani Ports ) సరికొత్త రికార్డులతో సూపర్ పెర్ఫార్మెన్స్ చూపించింది. ట్రేడింగ్ సెషన్లో ఈ షేర్ ఏకంగా 2.76 శాతం లాభపడి, రూ.1,860.20 వద్ద తన 52 వారాల నూతన గరిష్ట స్థాయిని తాకింది. గత ఏడాది కాలంలో 28 శాతానికి పైగా పెరిగిన ఈ స్టాక్.. కేవలం గడిచిన 3 నెలల్లోనే ఇన్వెస్టర్లకు 42 శాతం బంపర్ రిటర్న్స్ ఇచ్చింది. ఈ భారీ పెరుగుదల వెనుక ఒక సంచలన విదేశీ ఒప్పందం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇంతకీ ఆ డీల్ ఏంటో తెలుసా..
రూ.13,225 కోట్ల విదేశీ డీల్..
ప్రపంచంలోనే అతిపెద్ద షిప్పింగ్ సంస్థల్లో ఒకటైన MSC (మెడిటరేనియన్ షిప్పింగ్ కంపెనీ) కి చెందిన కంటైనర్ టెర్మినల్ వింగ్ ‘TiL’ తో అదానీ పోర్ట్స్ ఒక కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, అదానీ విజింజం పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ (AVPPL) లో TiL సంస్థ 49 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఈ మెగా డీల్ విలువ దాదాపు 1.4 బిలియన్ డాలర్లు (అంటే భారత కరెన్సీలో సుమారు రూ.13,225 కోట్లు). ఈ పెట్టుబడి తర్వాత విజింజం పోర్ట్ మొత్తం ఎంటర్ప్రైజ్ విలువ 2.85 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టారు. అయితే దీనికి ఇంకా కొన్ని రెగ్యులేటరీ అనుమతులు రావాల్సి ఉంది.
Also Read
- RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
- Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
- IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
- Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
పోర్ట్ సామర్థ్యం భారీగా పెంపు..
ఈ భాగస్వామ్యంతో కేరళంలోని విజింజం పోర్ట్ రూపురేఖలు మారనున్నాయి. అదానీ గ్రూప్ ఈ పోర్ట్ యొక్క కంటైనర్ హ్యాండ్లింగ్ సామర్థ్యాన్ని భారీగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఉన్న 16 లక్షల TEU (కంటైనర్ కొలత) సామర్థ్యాన్ని, డిసెంబర్ 2028 నాటికి ఏకంగా 57 లక్షల TEUలకు పెంచనున్నారు. ఈ సామర్థ్య పెంపు వల్ల ప్రస్తుతం ఆగ్నేయాసియా పోర్టుల ద్వారా సాగుతున్న బంగ్లాదేశ్‌కు చెందిన భారీ ట్రాన్స్షిప్మెంట్ కార్గో ట్రాఫిక్ భవిష్యత్తులో విజింజం పోర్టుకు మళ్లే అవకాశం ఉంది. కాగా అదానీ పోర్ట్స్‌కు MSC సంస్థతో ముంద్రా, ఎన్నోర్ పోర్టులలో ఇప్పటికే విజయవంతమైన భాగస్వామ్యం ఉంది. విజింజం పోర్ట్ ప్రారంభమైన తొలి 18 నెలల్లోనే 20 lakhs TEU ల కంటైనర్లను హ్యాండిల్ చేసి రికార్డు సృష్టించగా, అందులో అత్యధిక వాటా MSC కార్గోదే కావడం విశేషం.
ఇన్వెస్టర్లకు బ్రోకరేజ్ సలహా..
ఈ భారీ అంతర్జాతీయ ఒప్పందం నేపథ్యంలో ప్రముఖ డొమెస్టిక్ బ్రోకరేజ్ హౌస్ ఎమ్కే (Emkay) అదానీ పోర్ట్స్ స్టాక్‌పై అత్యంత బుల్లిష్‌గా ఉంది. పోర్ట్ సామర్థ్యం పెరగడం, విదేశీ భాగస్వామ్యం వల్ల దీర్ఘకాలంలో కంపెనీకి తిరుగులేని వృద్ధి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నమ్మకంతోనే ఎమ్కే సంస్థ అదానీ పోర్ట్స్‌కు ‘BUY’ (కొనవచ్చు) రేటింగ్‌ను కొనసాగిస్తూ.. మార్చి 2027 నాటికి దీని టార్గెట్ ప్రైస్‌ను రూ.1,900 నుంచి నేరుగా రూ. 2,000 కు పెంచేసింది.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!