Site icon NTV Telugu

Mohammed Shami: షమీ వేసిన బాల్స్ బుల్లెట్ కంటే తక్కువేమీ కాదు.. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ ప్రశంసలు

Shami

Shami

ప్రపంచకప్ 2023లో మహమ్మద్ షమీ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. అతని బౌలింగ్ పై మాజీ క్రికెట్ దిగ్గజాలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 కీలక వికెట్లు తీసి.. జట్టు విజయానికి కీలకపాత్ర పోషించాడు. అయితే ఈ మ్యాచ్ తర్వాత.. న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ సైమన్ డౌల్ షమీపై పొగడ్తల వర్షం కురిపించాడు.

Read Also: JioPhone Prima 4G: జియో 4G ఫోన్‌ విడుదల.. ధర, ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే..!

ఐసీసీ షేర్ చేసిన వీడియోలో న్యూజిలాండ్ మాజీ వెటరన్ బౌలర్ షమీ గురించి మాట్లాడటం కనిపించింది. మహ్మద్ షమీ అంటే ఇష్టమని.. షమీకి అద్భుత ప్రదర్శన చేయడం ఇది తొలిసారి కాదన్నాడు. అతను జట్టు నుండి బయటకు వెళ్లి తిరిగి వచ్చి మళ్లీ అదే ప్రదర్శన ఇస్తాడని తెలిపాడు. అతని బౌలింగ్ శైలి అంటే ఇష్టమని చెప్పాడు. అతను బౌలింగ్ చేసే సీమ్ పొజిషన్ క్రికెట్‌లో అత్యుత్తమమైనదిగా పేర్కొన్నాడు. అతని బౌలింగ్ బుల్లెట్ అని సైమన్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అతనికి జట్టులో తిరుగులేదని.. టీమ్లో మంచి పొజిషన్ను ఉంచుకున్నాడని తెలిపాడు.

Read Also: Thailand: భారతీయులకు గుడ్‌న్యూస్‌.. వీసా లేకుండానే థాయ్‌లాండ్‌కు ప్రయాణించవచ్చు..

ఇదిలా ఉంటే.. ఈ ప్రపంచ కప్ మొదటి నాలుగు మ్యాచ్‌లలో.. టీమిండియా షమీని బెంచ్‌పై ఉంచింది. అతని స్థానంలో శార్దూల్ ఠాకూర్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లో భాగం చేసింది. కానీ బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడటంతో.. జట్టులో రెండు మార్పులు చేశారు. దీంతో హార్దిక్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ స్థానంలో మహ్మద్ షమీ జట్టులోకి వచ్చాడు. టోర్నీలో ఆడిన తొలి మ్యాచ్ కే షమీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. న్యూజిలాండ్‌తో తన తొలి మ్యాచ్‌లో షమీ 5 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టు వెన్ను విరిచాడు. ఆ తర్వాత ఇంగ్లండ్‌పై షమీ నాలుగు వికెట్లు పడగొట్టాడు.

Exit mobile version