Mohammad Amir: “ఆ ఇద్దరు లేకుంటే మీకు దిక్కే లేదు”.. టీమిండియాపై మళ్లీ విషం కక్కిన పాక్ మాజీ పేసర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohammad Amir: మరికొన్ని గంటల్లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ సమయం ప్రారంభం కానుంది. భారత్, న్యూజిలాండ్ మధ్య తుది పోరు రసవత్తరంగా సాగనుంది. కోట్లాది మంది అభిమానులు ఈ మ్యాచ్ కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తున్నారు. అయితే.. ఈ టీ20 వరల్డ్ కప్‌లో మొదటి నుంచి టీమిండియాపై పాకిస్థాన్ మాజీ పేసర్ మహమ్మద్ విమర్శలు కురిపిస్తూనే ఉన్నాడు. మొదటి నుంచి భారత్ అన్ని మ్యాచుల్లో ఓడిపోతుందని విషం కక్కుతూ వస్తున్నాడు. టీమిండియా ఫైనల్‌కు వెళ్లదంటూ గతంలో వ్యాఖ్యానించాడు. కానీ భారత్ ఫైనల్‌కు చేరుకుంది. ఇప్పుడు మళ్లీ అక్కసు వెళ్లగక్కడం మొదలు పెట్టాడు. ఫైనల్లో న్యూజిలాండ్ పక్కా విజయం సాధిస్తుందని మరోసారి జోష్యం చెప్పాడు. ‘హార్నా మనా హై’ అనే కార్యక్రమంలో అమీర్ మాట్లాడుతూ.. భారత్ జట్టుగా కంటే వ్యక్తిగత ప్రదర్శనలపైనే ఎక్కువగా ఆధారపడుతోందని విమర్శించాడు. “సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాను న్యూజిలాండ్ ఓడించిన తీరు అద్భుతం. వారు ఒక జట్టుగా రాణిస్తున్నారు. కానీ భారత్ విషయానికి వస్తే.. కేవలం జస్ప్రీత్ బుమ్రా, సంజూ శామ్సన్ ప్రదర్శనల వల్లే ఇక్కడి దాకా వచ్చింది. వీరిద్దరూ లేకుంటే భారత్ గెలిచేది కాదు.. అంటే జట్టులో ఐక్యత లోపించింది.” అని అమీర్ వ్యాఖ్యానించాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం పరిస్థితులు వివరించాడు. ఈ పిచ్ స్థితిగతులను చూస్తే న్యూజిలాండ్‌కే కలిసి వస్తుందన్నాడు. బౌలింగ్ విభాగంలో భారత్ కంటే కివీస్ ఎంతో బలంగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
READ MORE: Samyuktha:ఉమెన్స్ డే స్పెషల్.. ‘ది బ్లాక్ గోల్డ్’ నుండి సంయుక్త.. పవర్ఫుల్ లుక్
Also Read
- Madanapalle Lady Don: మదనపల్లె ‘లేడీ డాన్’ ఇంట్లో పోలీసుల మెరుపు దాడులు.. 50 రకాల ఆస్తి, 15 ఫోర్జరీ పత్రాలు స్వాధీనం!
- Petrol Attack: ఆదోనిలో దారుణం.. మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇద్దరు మహిళలు!
- India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
- INDW Vs PAKW: కుప్పకూలిన పాకిస్థాన్.. 55 పరుగులకే ఆలౌట్..
అంతేకాదు.. భారత్ బౌలింగ్‌పై సంచలన స్టేట్మెంట్ ఇచ్చాడు. బుమ్రా తప్ప మరెవరూ ఫామ్‌లో లేరన్నాడు. హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి విఫలమవుతున్నారన్నాడు. టీమిండియా బుమ్రాపైనే ఎక్కువగా ఆధారపడుతోందని చెప్పాడు. కానీ న్యూజిలాండ్ బౌలింగ్ చాలా అద్భుతంగా ఉందన్నాడు. ఇక ఓపెనర్ అభిషేక్ శర్మపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. అభిషేక్ ‘వన్ డైమెన్షనల్’ ప్లేయర్ అని, అంతర్జాతీయ స్థాయిలో ఆడేందుకు సిద్ధంగా లేడని విమర్శించాడు. ఫైనల్లో అభిషేక్ స్థానంపై చర్చ జరుగుతున్నా, టీమ్ మేనేజ్మెంట్ మాత్రం అతనికే మద్దతుగా నిలుస్తోందన్నాడు. ఇక అమీర్ నేటికి తాళం వేయాలంటే భారత్ ఫైనల్లో ఘన విజయం సాధించాలి. ఇలాంటి పాక్ మాజీ ప్లేయర్ల నోళ్లకు కప్పుతో తాళం వేయాలి.
READ MORE: Team India: టీమిండియాలో భారీ మార్పులు.. సూర్యకు వీడ్కోలు, అయ్యర్‌కు నిరాశ!
తాజావార్తలు
-
Madanapalle Lady Don: మదనపల్లె ‘లేడీ డాన్’ ఇంట్లో పోలీసుల మెరుపు దాడులు.. 50 రకాల ఆస్తి, 15 ఫోర్జరీ పత్రాలు స్వాధీనం!
-
Spurious Liquor Tragedy: కల్తీ మద్యం తాగి తొమ్మిది మంది మృతి.. 25 మందికి పైగా ఆసుపత్రికి తరలింపు
-
SJ Suryah: భైరవుడిని మించిన విలనిజం.. సర్దార్ 2 లో SJ సూర్య ‘బ్లాక్ డాగర్’పై భారీ హైప్!
-
OTT Releases: ఈ వీకెండ్ ఓటీటీలో చూడాల్సిన హాలీవుడ్ సినిమాలు.. థ్రిల్లర్ల నుంచి, ఫాంటసీ వరకు
-
December Fight : సంక్రాంతి తర్వాత హాట్ స్లాట్‌గా డిసెంబర్
ట్రెండింగ్
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!