నా ప్రయాణం ముగియనుంది.! తన రిటైర్మెంట్ను ప్రకటించిన Cristiano Ronaldo.. శోకసంద్రంలో అభిమానులు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cristiano Ronaldo: ఫుట్‌బాల్ ప్రపంచ దిగ్గజ ఆటగాళ్లలో ఒకరైన క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) తన కెరీర్‌కు సంబంధించి అధికారిక ప్రకటన చేశాడు. 2026 ఫిఫా వరల్డ్‌కప్ తన కెరీర్లో చివరి ప్రపంచకప్ అని స్పష్టం చేసిన ఆయన, ఈ టోర్నీలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలనుకుంటున్నట్లు అన్నారు. స్పెయిన్‌తో జరగనున్న రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన ఈ పోర్చుగల్ కెప్టెన్.. తన వరల్డ్‌కప్ భవిష్యత్తుపై నెలకొన్న ఊహాగానాలకు తెరదించాడు.
ఈ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. “ఇదే నా చివరి వరల్డ్‌కప్. అయితే రేపటి మ్యాచ్ నా చివరి మ్యాచ్ కాకూడదని ఆశిస్తున్నాను” అని రొనాల్డో వ్యాఖ్యానించాడు. పోర్చుగల్ జట్టు టోర్నీలో మరింత ముందుకు సాగాలని కోరుకుంటున్నానని, ప్రస్తుతం తన దృష్టి మొత్తం జట్టు విజయంపైనే ఉందని చెప్పుకొచ్చాడు. అలాగే మీడియా, విమర్శకుల నుంచి వస్తున్న వ్యాఖ్యలపై కూడా రొనాల్డో స్పందించాడు. పోర్చుగల్ తదుపరి దశకు చేరితే తనపై విమర్శలు కొనసాగించడానికి మరో అవకాశం లభిస్తుందని సరదాగా వ్యాఖ్యానించాడు.
Also Read
- Hyderabad: "కల్తీ ఫుడ్, కిచెన్‌లో బొద్దింకలు, ఎలుకలు".. హైదరాబాద్‌లోని ఈ 11 ప్రముఖ రెస్టారెంట్ల లైసెన్సులు రద్దు
- KTR: ‘‘చావు నోట్లో తల పెట్టయినా.. మీకు గుర్తింపు తెస్తా’’.. ‘ది ప్యారడైజ్’ సినిమాపై కేటీఆర్ సంచలన రివ్యూ
- Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
- AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
“అలా అయితే మీరు నన్ను ఇంకొంచెం విమర్శించవచ్చు. నన్ను ఎప్పుడూ విమర్శించాలనే ప్రయత్నం చేస్తుంటారు” అని చిరునవ్వుతో అన్నాడు. మరో సందర్భంలో విలేకరులు తన చివరి వరల్డ్‌కప్ మ్యాచ్ కావొచ్చని ప్రశ్నించగా.. “మీరు నన్ను ఇక చూడకూడదనుకుంటున్నారా?” అంటూ చమత్కరించాడు. అయితే తన కెరీర్‌పై ఎలాంటి పశ్చాత్తాపం లేదని స్పష్టం చేశాడు. “రేపు ఏం జరిగినా నేను పూర్తి సంతృప్తితో వెళ్తాను. 100% కాదు.. 1000%.. ఫుట్‌బాల్‌కు నేను ఇవ్వగలిగినదంతా ఇచ్చాను” అని రొనాల్డో అన్నారు.
డబ్బు కోసం కాదు.. ఫుట్‌బాల్‌పై ప్రేమతోనే:
తాను ఎప్పుడూ డబ్బు కోసం ఫుట్‌బాల్ ఆడలేదని రొనాల్డో పేర్కొన్నాడు. దేవుడి దయతో నా జీవితం చాలా బాగుంది. నేను ఫుట్‌బాల్ ఆడటానికి కారణం డబ్బు కాదు. ఈ ఆటపై ఉన్న ప్రేమే.. నన్ను ఇన్ని సంవత్సరాలు ముందుకు నడిపించింది అని చెప్పుకొచ్చారు. ఈ టోర్నీలో తన ప్రదర్శనపై వస్తున్న విమర్శలను కూడా ఆయన తిప్పికొట్టాడు. ఇప్పటివరకు మూడు గోల్స్ సాధించానని, కొందరు మరింత బాగా ఆడుతున్నప్పటికీ తాను చెడు ప్రదర్శన చేయలేదని స్పష్టం చేశాడు.
స్పెయిన్‌తో కీలక పోరు:
ఇక రౌండ్ ఆఫ్ 16లో పోర్చుగల్‌కు స్పెయిన్ రూపంలో గట్టి సవాల్ ఎదురుకానుంది. ఈ మ్యాచ్ విజేత క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోనుంది. స్పెయిన్ బలమైన జట్టేనని అంగీకరించిన రొనాల్డో.. నాకౌట్ మ్యాచ్‌లలో చిన్న చిన్న అంశాలే ఫలితాన్ని నిర్ణయిస్తాయని అభిప్రాయపడ్డాడు. స్పెయిన్ ఎప్పుడూ టైటిల్ ఫేవరెట్ జట్టే. వారికి మాకంటే ఎక్కువ విజయాలు ఉన్నాయి. కానీ ఇది వేరే టోర్నీ, వేరే ఆటగాళ్లు. గెలుపు చిన్న చిన్న విషయాలపైనే ఆధారపడి ఉంటుంది అని రోనాల్డో అన్నాడు. స్పెయిన్‌పై తన రికార్డు కూడా బాగానే ఉందని.. ఈ మ్యాచ్‌లో మేమే గెలుస్తామనే భావన ఆయ్నదని ధీమా వ్యక్తం చేశాడు. స్పెయిన్‌పై పోర్చుగల్ విజయం సాధిస్తే రొనాల్డో చివరి వరల్డ్‌కప్ ప్రయాణం మరికొంత కాలం కొనసాగుతుంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం ఫుట్‌బాల్ చరిత్రలో అత్యంత గొప్ప కెరీర్లలో ఒకటైన రొనాల్డో అధ్యాయం ముగియనుంది.
"Vai ser o meu último mundial" 🗣️ Cristiano Ronaldo 😢#DAZNFIFAWC pic.twitter.com/aESFoNG9Tr
— DAZN Portugal (@DAZNPortugal) July 5, 2026
తాజావార్తలు
-
Heavy Rainfall: వర్ష బీభత్సం.. ఉత్తరప్రదేశ్‌లో 65 గంటల పాటు భారీ వర్షం.. 14 రాష్ట్రాల్లో అలర్ట్
-
Motorola Edge 60 Fusion 5G: మోటరోలా Edge 60 Fusion 5G.. 12GB RAM, 256GB స్టోరేజ్‌తో పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్
-
Shah Rukh Khan : షారూఖ్ కోసం వెయిట్ చేస్తోన్న సీక్వెల్స్.. డాన్3లో రిటర్న్ కాబోతున్నాడని టాక్
-
IND vs WI 1st ODI: నేడు భారత్, వెస్టిండీస్ మొదటి వన్డే.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, పిచ్ డీటెయిల్స్ ఇవే!
-
BYD Seal U PHEV SUV: భారత్‌లోకి BYD తొలి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ SUV.. 26.6 kWh బ్యాటరీ, 1,000KM కు పైగా రేంజ్
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?