Site icon NTV Telugu

Manda Krishna Madiga: మోడీ గెలుపునకు కృషి చేస్తా..

Mandakrishna Madiga

Mandakrishna Madiga

మోడీ మారోసారి ప్రధాని అవుతారని.. అందుకు పూర్తిగా కృషి చేస్తానని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. శుక్రవారం వరంగల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజమైన ఎస్సీలకు రిజర్వేషన్ ఫలాలు దక్కాల్సిన అవసరం ఉందని తెలిపారు. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం కాంగ్రెస్ పై విమర్శలు కురిపించారు. శ్రీహరి నిజమైన ఎస్సీ కాదని గతంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. నకిలీ ఎస్సీ రిజర్వేషన్లు కొల్లగొడుతున్నారన్నారు.. మరీ ఇప్పుడు నిజమైన ఎస్సీ కాదంటూనే కాంగ్రెస్ శ్రీహరి కుమార్తె కడియం కావ్యకు వరంగల్ లోక్ సభ ఎంపీ టికెట్ ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ వైఖరిని ఆయన తప్పుబట్టారు.

READ MORE: Chhattisgarh : విడాకులు తీసుకుని వేరే పెళ్లి చేసుకున్న పేరెంట్స్.. కూతురిపై కోర్టు కీలకవ్యాఖ్యలు

అన్ని రాజకీయ పార్టీలు కులమతాలకతీతంగా అజెండాలో లేని అంశాలను ముందుకు తీసుకెళ్లాలనని విజ్ఞప్తి చేశారు. దశల వారీగా ఎస్సీ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాగా, ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉంటామని బీజేపీ హామీ ఇవ్వడంతో మందకృష్ణ మాదిగ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి మద్దతు తెలుపుతోన్న విషయం తెలిసిందే. ఈ మేరకు రాష్ట్రంలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలిపించేందుకు ఆయన తన వంతు కృషి చేస్తున్నారు. బీజేపీ తరఫున ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకూ పోలింగ్ జరగనుంది. ఈ రోజు సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

Exit mobile version