Modi-Trump: మోడీ–ట్రంప్ భేటీలో ట్విస్ట్.. ‘ప్రశ్నలు వద్దు’ అన్న భారత్, ట్రంప్ మాత్రం అడిగేశారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Ambassador Sergio Gor: ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సమిట్ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన భేటీకి సంబంధించి ఒక ఆసక్తికరమైన నిజం వెలుగులోకి వచ్చింది. మోడీతో సమావేశం తర్వాత విలేకరుల ప్రశ్నలకు చోటు ఇవ్వొద్దని భారత్ స్పష్టంగా విజ్ఞప్తి చేసినప్పటికీ, ఆ విషయాన్ని ట్రంప్ మర్చిపోవడంతో అది కాస్తా 45 నిమిషాల సుదీర్ఘ ప్రెస్ కాన్ఫరెన్స్‌గా మారిపోయింది. ఈ విషయాన్ని భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ ‘ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరమ్’ వేదికగా వెల్లడించారు.
ఫ్రాన్స్‌లోని ఈవియన్-లెస్-బైన్స్‌లో జరిగిన ఈ సమావేశానికి ముందు వెనుక జరిగిన రసవత్తర డ్రామాను గోర్ గుర్తుచేసుకున్నారు. “సమావేశానికి ముందు బ్యాక్‌స్టేజ్‌లో అధ్యక్షుడితో నేను ఒక్కడినే ఉన్నాను. భారత్ వైపు నుంచి ఏమైనా విజ్ఞప్తులు ఉన్నాయా అని ఆయన నన్ను అడిగారు. మీడియాని లోపలికి అనుమతిద్దాం కానీ, పూర్తిస్థాయి ప్రెస్ కాన్ఫరెన్స్ వద్దు, ఎలాంటి ప్రశ్నలు అడగొద్దని భారత విదేశాంగ శాఖ కోరినట్లు నేను ట్రంప్‌కు చెప్పాను. దానికి ఆయన ‘సరే, నాకేమీ అభ్యంతరం లేదు’ అని ఒప్పుకున్నారు” అని గోర్ వివరించారు. అయితే తీరా సమావేశం ప్రారంభమయ్యాక కథ వేరేలా మారింది. గదిలో దాదాపు 50 కెమెరాల మధ్య ఇద్దరు నేతలు ఎదురెదురుగా కూర్చుని ఆరంభ ఉపన్యాసాలు పూర్తి చేశారు. ఆ వెంటనే ట్రంప్ కెమెరాల వైపు చూస్తూ “ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా?” అని విలేకరులను అడిగేశారు. దీంతో భారత్ వద్దు అనుకున్న పరిస్థితి ఏర్పడి, అన్ని రకాల అంశాలపై ఏకంగా 45 నిమిషాల పాటు ప్రెస్ మీట్ నడిచింది. అయితే రాయబారి చేసిన ఈ వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.
Also Read
- IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్‌లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
- Abhijit Dipke: "రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి".. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
- CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
- Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్న సమయంలో, అలాగే పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల నౌకాయానం ప్రభావితమవుతున్న తరుణంలో ఈ సమావేశం జరిగింది. కాగా, ఈ భేటీకి కొద్దిరోజుల ముందే హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకపై అమెరికా నేవీ జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ నావికులు మరణించారు. ఈ అంశాన్ని ప్రధాని మోదీ ట్రంప్ వద్ద ప్రస్తావిస్తూ, “హార్ముజ్ జలసంధిలోని భారతీయ నావికుల భద్రత మాకు అత్యంత ముఖ్యం” అని తేల్చిచెప్పారు. అయితే నౌకాయానంలో ఇలాంటి ప్రమాదాలు సాధారణమేనంటూ ట్రంప్ దాని తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేశారు. ఈ భేటీలో భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలతో పాటు హార్ముజ్ జలసంధి ప్రాంతంలో పరిస్థితిపై చర్చించారు. భారత్‌తో వాణిజ్య ఒప్పందానికి చాలా దగ్గరగా ఉన్నామని చెప్పిన ట్రంప్, వేరే ఏదైనా దేశం భారత్‌పై దాడికి దిగితే అమెరికా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. మోడీ వైపు చూపిస్తూ “ఒకవేళ ఆ వ్యక్తిపై ఎవరైనా దాడి చేస్తే మేము అండగా ఉంటాం. అయితే కొత్త నాయకుడు వస్తే మాత్రం నేను చెప్పలేను” అని వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్‌లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
-
Abhijit Dipke: “రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి”.. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
-
Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!