Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Film Celebrity Interviews Dulquer Salmaan Interview For Lucky Baskhar

Dulquer : తెలుగు ప్రేక్షకుల ప్రేమ చూసి ఆశ్చర్యపోయా.. అదే కొత్తగా అనిపించింది: దుల్కర్ సల్మాన్ ఇంటర్వ్యూ

Published Date :November 4, 2024 , 5:17 pm
By Bhargav Chaganti
Dulquer : తెలుగు ప్రేక్షకుల ప్రేమ చూసి ఆశ్చర్యపోయా.. అదే  కొత్తగా అనిపించింది: దుల్కర్ సల్మాన్ ఇంటర్వ్యూ
  • Follow Us :
  • google news
  • dailyhunt

‘మహానటి’, ‘సీతా రామం’ వంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన దుల్కర్, ‘లక్కీ భాస్కర్’తో హ్యాట్రిక్ విజయాన్ని సాధించి, తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ‘లక్కీ భాస్కర్’ చిత్రాన్ని నిర్మించారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయిక కాగా జివి ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు. దీపావళి కానుకగా థియేటర్లలో విడుదలైన ‘లక్కీ భాస్కర్’, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ సంచలన వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన కథానాయకుడు దుల్కర్ సల్మాన్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

లక్కీ భాస్కర్ సినిమా ఒప్పుకోవడానికి కారణం ఏమిటి?
వెంకీ కథ చెబుతున్నప్పుడు, ఫస్ట్ హాఫ్ వినగానే ఈ సినిమా కచ్చితంగా చేయాలనుకున్నాను. బ్యాంకింగ్ నేపథ్యాన్ని తీసుకొని మధ్యతరగతి కుటుంబ కథ చెప్పడం కొత్తగా అనిపించింది. నేను ఎప్పటినుంచో వాస్తవానికి దగ్గరగా ఉండే ఒక మధ్యతరగతి తండ్రి పాత్ర చేయాలనుకుంటున్నాను. అది ఈ సినిమాతో నెరవేరింది, నా దృష్టిలో ఇది వాస్తవ కథ. బ్యాక్ గ్రౌండ్ లో హర్షద్ మెహతా లాంటివాడు భారీ స్కాం చేస్తుంటే, ఒక చిన్న బ్యాంక్ ఉద్యోగి తన పరిధిలో స్కాం చేయడం అనేది కొత్త పాయింట్. ఇది బ్యాంకింగ్ నేపథ్యమున్న సినిమా కావడంతో వెంకీ ఎంతో రీసెర్చ్ చేశాడు. బ్యాంకింగ్ సెక్టార్ కి చెందినవారు కూడా ఇందులో ఎటువంటి తప్పులు లేవని చెప్పడం విశేషం.

Also Read

  • Mowgli : రోషన్ కనకాల కోసం బరిలోకి జూనియర్ ఎన్టీఆర్
  • Srinidhi Shetty: రాగ పాత్రతో మరో ఫేస్ చూపించబోతోంది శ్రీనిధి.. ‘తెలుసు కదా’పై ఆసక్తికర కామెంట్స్‌!
  • Saif Ali Khan : నాపై దాడి కొందరికి నాటకమైంది.. అసహనం వ్యక్తం చేసిన సైఫ్
  • TG Vishwaprasad : ‘మిరాయ్‌’ ఫాంటసీ విజువల్ వండర్..అయినా అందుకే టికెట్ రేట్లు పెంచలేదు

లక్కీ భాస్కర్ పాత్రలో గ్రే షేడ్స్ ఉన్నాయి కదా.. ఎలాంటి వర్క్ చేశారు?
ప్రత్యేకంగా ఏమీ చేయలేదు. నటుడిగా అన్ని రకాల పాత్రలు చేయాలి. షారుఖ్ ఖాన్ లాంటి వారు కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేశారు. మనలోని నటుడిని బయటకు తీసుకురావాలంటే ఇలాంటి విభిన్న పాత్రలు చేయాలి. భాస్కర్ పాత్రలో ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి. నటుడిగా ఇలాంటి పాత్రలు సంతృప్తిని ఇస్తాయి.

షూటింగ్ లో ఏమైనా ఛాలెంజ్ లు ఎదురయ్యాయా?
ఛాలెంజింగ్ గా అనిపించలేదు. ప్రతి రోజూ, ప్రతి సీన్ చేయడాన్ని ఆస్వాదించాను. ప్రతి దశలో ఎంజాయ్ చేశా, ఈ సినిమా ఎంతో సంతృప్తిని ఇచ్చింది.

తెలుగులో హ్యాట్రిక్ విజయాలు సాధించడం ఎలా ఉంది?
ప్లాన్ చేస్తే విజయాలు రావు. అందరూ మంచి కథలు చెప్పాలి, మంచి సినిమాలు చేయాలని అనుకుంటాం. అలాగే ముందుకు వెళ్తున్నా,. కష్టానికి తగ్గ ఫలితం దక్కడం సంతోషంగా ఉంది.

బ్యాంకింగ్ సబ్జెక్టు అంటే సామాన్యులకు అర్థమవుతుందా లేదా అనే సందేహం కలగలేదా?
ఈ రోజుల్లో బ్యాంక్ అకౌంట్ అనేది దాదాపు అందరికీ ఉంటుంది. పైగా ఇందులో భాస్కర్ సైడ్ బిజినెస్ లా.. చదువురాని వారికి ఫామ్ నింపడం లాంటివి చేస్తుంటాడు. అలాంటి సన్నివేశాలు చాలా మందికి కనెక్ట్ అవుతాయి. ఈ సినిమా అందరికీ అర్థమయ్యేలా వెంకీ చాలా బాగా తీశారు.

సినిమాలో చూపించినట్టు మిడిల్ క్లాస్ వారికి లాటరీ అనేది డ్రీమ్.. మీరు నిజ జీవితంలో లాటరీ టికెట్ కొన్నారా?
మమ్ముట్టి గారి కొడుకు అయినప్పటికీ, నేను సాధారణ యువకుల్లాగానే ఆలోచిస్తా, యువకుడిగా ఉన్నప్పుడు లాటరీ తగిలితే, సొంతంగా నాకు నచ్చినవన్నీ కొనుక్కోవచ్చు అని కలలు కనేవాడిని.

లక్కీ భాస్కర్ సినిమా చూసి మీ తండ్రి మమ్ముట్టి గారి స్పందన ఏంటి? ఆయనకి, మీకు మధ్య సినిమాలకు సంబంధించిన చర్చలు జరుగుతాయా?
నాతో ఏం చెప్పలేదు. కానీ, దర్శకుడు వెంకీతో మాట్లాడి ప్రత్యేకంగా అభినందించారు. ఏదైనా కొత్త కథ విని నచ్చితే, ఇద్దరం దాని గురించి మాట్లాడుకుంటాం. నాకు బాగా నచ్చిన కథల గురించి ఆయనకు చెబుతుంటాను. మమ్ముట్టి పలు తెలుగు సినిమాలలో నటించారు. నేను తెలుగు సినిమా చేసే ముందు, ఆయనకు చెప్తే.. బ్యూటిఫుల్ లాంగ్వేజ్ అని చెప్పారు.

జి.వి. ప్రకాష్ సంగీతం గురించి?
కథకి తగ్గట్టుగా, ప్రతి ఎమోషన్ ని ప్రేక్షకులు ఫీలయ్యేలా అద్భుతమైన సంగీతం అందించారు.

తెలుగు ప్రేక్షకుల గురించి?
తెలుగు ప్రేక్షకుల ప్రేమ చూసి మొదట నేను ఆశ్చర్యపోయాను. మహానటికి ముందు మలయాళ ప్రేక్షకులకు, కొంతవరకు తమిళ ప్రేక్షకులకు తెలుసు. మహానటి నుంచి తెలుగు ప్రేక్షకులు ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. సీతారామం చేయడానికి ఎక్కువ గ్యాప్ తీసుకున్నప్పటికీ, ఆ ప్రేమ పెరిగింది తప్ప తగ్గలేదు.

బాలకృష్ణ గారి అన్ స్టాపబుల్ షోలో పాల్గొనడం ఎలా ఉంది?
బాలకృష్ణ గారు నిజంగా అన్ స్టాపబుల్. ఆయన ఎనర్జీ మ్యాచ్ చేయడం కష్టం. బాలకృష్ణ ఆరోజు 12 గంటలకు పైగా షూటింగ్ లో పాల్గొన్నారు. అయినప్పటికీ చివరి వరకు అదే ఎనర్జీతో ఉన్నారు.

మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్?
మీడియా నుంచే వచ్చింది. సినిమా గురించి, నా నటన గురించి పాజిటివ్ రివ్యూలు రావడం సంతోషం కలిగించింది.

మీ డ్రీమ్ రోల్ ఏంటి? మీ రాబోయే సినిమాలు?
అలా అని ఏమీ లేదు. అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంది. తెలుగులో ‘ఆకాశంలో ఒక తార’ సినిమా చేస్తున్నాను. అది కూడా ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Dulquer Salmaan
  • Dulquer Salmaan Interview
  • Lucky Baskhar

తాజావార్తలు

  • KaruppuAudioLaunch : ఏకంగా 73 సినిమాలకు మ్యూజిక్ చేస్తున్న యంగ్ సెన్సేషన్

  • Mohsin Khan: మోసిన్ ఖాన్ సంచలనం.. కేకేఆర్‌పై విరుచుకుపడి 5 వికెట్ల హాల్‌తో సరికొత్త రికార్డులు

  • Mehreen: వైభవంగా నటి మెహరీన్ పెళ్లి.. వరుడు ఎవరంటే?

  • Toes Writing: నిరాశకు లొంగని ధైర్యం.. చేతులు లేకపోయినా సాటిలేని ప్రతిభ.. కాళ్లతో రాసి ఫస్ట్ డివిజన్ సాధించిన శివాని

  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions