NTV Telugu Site icon

PM Modi : రాజ్యంగం గురించి నెహ్రూ సీఎంలకు లేఖ రాశారు.. పార్లమెంట్‌లో మోడీ సంచలన వ్యాఖ్యలు

Modi

Modi

నేడు పార్లమెంట్ సమావేశాల్లో 75 ఏళ్లు పూర్తి చేసుకున్న భారత రాజ్యాంగం, రాజ్యాంగ ప్రయాణంపై చర్చ జరిగింది. డిసెంబరు 13 నుంచి లోక్‌సభలో రాజ్యాంగంపై రెండు రోజుల చర్చను ఏర్పాటు చేశారు. ప్రతిపక్ష ఎంపీల ప్రసంగాల అనంతరం ప్రధాని మోడీ పార్లమెంట్‌లో ప్రసంగించారు. ప్రసంగం మధ్యలో కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశం రాజ్యాంగం ఏర్పడి 25 ఏళ్లు పూర్తవుతున్న వేళ రాజ్యాంగాన్ని లాక్కున్నారన్నారు. దేశాన్ని జైలుగా మార్చి పౌరుల హక్కులను కాలరాశారన్నారు. ఇది కాంగ్రెస్ చరిత్రలో ఎప్పటికీ కడుక్కోలేని పాపమని అన్నారు. రాజ్యాంగ నిర్మాతల తపస్సును, శ్రమను నాశనం చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. 1951లో కాంగ్రెస్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి రాజ్యాంగాన్ని మార్చిందని, భావప్రకటనా స్వేచ్ఛపై దాడి చేసిందని అన్నారు.

READ MORE: Atrocious Incident: యువతిపై కౌన్సిలర్ అల్లుడు అత్యాచారయత్నం.. ఆమె కుటుంబంపై కత్తులతో దాడి

కాంగ్రెస్ రాజ్యాంగాన్ని తారుమారు చేసిందని, రాజ్యాంగంలోని ప్రాథమిక స్ఫూర్తిని విస్మరించిందని ప్రధాని అన్నారు. రాజ్యాంగ పరిషత్‌లో చేయలేని పనిని వెనుక నుంచి చేశారన్నారు. రాజ్యాంగం మనకు అడ్డం వస్తే.. ఎలాగైనా మార్చాలని పండిట్ నెహ్రూ ముఖ్యమంత్రులకు లేఖ రాశారని మోడీ అన్నారు. 55 ఏళ్లు ఒకే కుటుంబం పాలించిందని గుర్తు చేశారు. ఈ కాలంలో రాజ్యాంగంపై నిరంతరం దాడి జరిగిందన్నారు. దుష్ట ఆలోచనలు, చెడు పనులు, చేష్టలతో కూడిన ఈ కుటుంబ సంప్రదాయ దేశాన్ని అనేక ఇబ్బందులకు గురి చేసిందని పేర్కొన్నారు.

READ MORE: Water Society Polls: సాగునీటి సంఘం ఎన్నికల్లో అధికారిపై కత్తితో దాడి.. ఎన్నికలు వాయిదా

“దేశంలో ఒక చోట కరెంటు ఉండేది. కానీ.. అది అక్కడ నుంచి మిగతా ప్రాంతాలకు సరఫరా కాలేదు. వన్ నేషన్, వన్ గ్రిడ్ ఈ సమస్యను పరిష్కరించింది. దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరాను సజావుగా, ప్రభావవంతంగా చేసింది.” అని ప్రధాని మోడీ తెలిపారు. జీఎస్టీ దేశ ఆర్థిక ఐక్యతను పటిష్టం చేసిందని మోడీ ప్రస్తావించారు. ఇది భారతదేశంలో సాధారణ మార్కెట్‌ను సృష్టించింది. ఇది వాణిజ్యం, పరిశ్రమలకు కొత్త ఊపునిచ్చిందన్నారు. డిజిటల్ విప్లవం ద్వారా ప్రతి వ్యక్తికి సమాన అవకాశాలు కల్పించేందుకు కృషి చేసినట్లు తెలిపారు. దేశ సమైక్యతకు ఆర్టికల్ 370 అడ్డుగా ఉందని, అందుకే ఆర్టికల్ 370ని సమాధి చేసినట్లు చెప్పారు.

 

Show comments