PM Modi Special Gifts: జపాన్ ప్రధానికి మోడీ ప్రత్యేక బహుమతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi Special Gifts: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భారతదేశం – జపాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో రెండు రోజుల పర్యటన నిమిత్తం టోక్యో వెళ్లారు. జపాన్‌లో పర్యటన ముగించిన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా దంపతులకు ప్రత్యేక బహుమతులను అందజేశారు. జపాన్ ప్రధానికి చాప్ స్టిక్‌లతో కూడిన రామెన్ గిన్నెను, ఆయన భార్యకు పాష్మినా శాలువాను బహుమతిగా అందజేశారు.
READ ALSO: AP News: కుప్పం ప్రాంత అభివృద్ధి కోసం సీఎం సమక్షంలో 6 ఎంఓయూలు!
Also Read
- Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
- Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్
- India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
- Religious Conversion Pressure: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఆ తర్వాత మతం మారాలని బ్లాక్మెయిల్.. ట్విస్ట్ ఏంటంటే..?
ఏంటి ఈ బహుమతుల ప్రత్యేకతలు..
షిగేరు ఇషిబాకు అందజేసిన పాతకాలపు గిన్నెసెట్ భారతీయ చేతిపనులు, జపనీస్ సంప్రదాయంతో కూడిన ప్రత్యేకమైన సమ్మేళనంగా తయారు చేయబడింది. ఇది నాలుగు చిన్న గిన్నెలు, వెండి చాప్‌స్టిక్‌లతో అలంకరించి ఉంది. ఈ డిజైన్ జపాన్ సాంప్రదాయ డాన్బురి, సోబా ఆచారాల నుంచి ప్రేరణ పొంది రూపొందించారు. ఈ బహుమతి రూపకల్పనలో ఉపయోగించిన చంద్రుని రాయి ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకున్నారు. గిన్నె బేస్ రాజస్థాన్‌లోని ప్రసిద్ధి చెందిన మక్రానా పాలరాయితో తయారు చేశారు. సాంప్రదాయ పార్చిన్ కారి శైలిలో సెమీ-విలువైన రాళ్లతో ఈ రామెన్ గిన్నెను అలంకరించారు.
జపాన్ ప్రధాన మంత్రి భార్యకు కూడా భారత ప్రధాన మంత్రి బహుమతి అందజేశారు. ఆమెకు పేపర్ మాచే బాక్స్‌లో పాష్మినా శాలువాను బహుమతిగా ఇచ్చారు. లడఖ్‌లోని చాంగ్తంగి మేక ఉన్నితో తయారు చేసిన ఈ పాష్మినా శాలువా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దీనిని కాశ్మీరీ కళాకారులు సాంప్రదాయ పద్ధతిలో చేతితో నేస్తారు. ఈ శాలువా ఒకప్పుడు రాజ కుటుంబాలు ధరించిన చరిత్ర కలిగి ఉంది. భారత ప్రధాని జపాన్ పర్యటనలో ఆర్థిక సహకారాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి ఇరు దేశాల ప్రధానులు ఇండియా – జపాన్ ఆర్థిక వేదికలో సమావేశమయ్యారు. ముందుగా జపాన్ ప్రధాని ఇషిబా ప్రధాని మోదీని అధికారికంగా స్వాగతించారు. ఆ తర్వాత రెండు దేశాల మధ్య ప్రతినిధి స్థాయి చర్చలు జరిగాయి. అనంతరం జపాన్‌లో భారత ప్రధాని తన పర్యటన ముగించుకొని చైనా బయలుదేరి వెళ్లారు.
READ ALSO: Air Turbulence: గాల్లో కలిసిపోగల జాగ్రత్త.. విమానాలపై తాజా నివేదికలో సంచలన విషయాలు..
తాజావార్తలు
-
Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
-
Varalaxmi Sarathkumar: “నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా”
-
Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
-
Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్
-
G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!