MLC Kavitha: కేసీఆర్‌తో సింగరేణి కార్మికుల జీవితాల్లో వెలుగులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సింగరేణి ఎన్నికల నేపథ్యంలో టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ. వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కింగర్ల మల్లయ్య హైదరాబాద్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిశారు. ఈ సందర్భంగా.. అనుసరించాల్సిన వ్యూహాలు, సన్నద్ధత గురించి చర్చలు జరిపారు. సింగరేణి సంస్థలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించామని, అదే స్పూర్తితో నాయకత్వ సారధ్యంలోనూ యువతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ… సింగరేణి కార్మికులు, ఉద్యోగుల్లో 50 శాతం ఉన్నారు కాబట్టి.. తమ యూనియన్ లో యువ నాయకత్వానికి ప్రాధాన్యం ఇస్తామని, 66 శాతం వరకు నాయకత్వ బాధ్యతల్లో అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. 1998లో ఆగిపోయిన కారుణ్య నియామకాలను 2018లో కేసీఆర్ తిరిగి పునరుద్ధరించి వేలాది మందిని నియమించారని పేర్కొన్నారు. జాతీయ సంఘాల కారణంగా 1998 వరకు కారుణ్య నియామకాలకు గండి పడిందని తెలిపారు.
Read Also: Manchu Manoj: హౌస్ ఆఫ్ మంచుస్ అంతా ఫేక్.. తేల్చి చెప్పేసిన మంచు మనోజ్
Also Read
- KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
- Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Sarfaraz Khan: వాట్ ఏ కమ్ బ్యాక్ డ్యూడ్.. సర్ఫరాజ్ ఖాన్‌పై ప్రశంసలు.. 17 కిలోలు తగ్గి మరీ..
సంస్థను లాభాలబాట పట్టించడానికి, సంస్థ ఎదుగుదలకు, కార్మికుల సంక్షేమానికి కేసీఆర్ ఎనలేని కృషి చేశారని, సింగరేణిని కష్టాల నుంచి కాపాడిన బీఆర్ఎస్ అనుబంధ సంఘం టీబీజీకేఎస్ ను ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. టీబీజీకేఎస్ ను గెలిపించుకుంటేనే కార్మికులకు న్యాయం జరుగుతుందని, కార్మికుల పక్షాన నిలబడే ఏకైక సంఘం టీబీజీకేఎస్ అని కవిత తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో కేసీఆర్ దాదాపు 20 వేల డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చి యువతకు ఉపాధి కల్పించారని తెలిపారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా సింగరేణి సంస్థ నికర లాభాల్లో కార్మికులకు భారీ మొత్తంలో వాటాలను పంచారని గుర్తు చేశారు. 1999-2000లో లాభాల్లో కార్మికులకు కేవలం 10 శాతం వాటా ఉండేదని, తెలంగాణ ఏర్పడినప్పుడు 18 శాతంగా ఉండేదని, దాన్ని కేసీఆర్ 32 శాతానికి పెంచారని వివరించారు. తద్వారా కార్మికుల కుటుంబాలకు గణనీయమైన ఆర్థిక ప్రయోజనం లభించిందని తెలియజేశారు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 61కి పెంచామమని, గతంలో సమ్మె చేస్తే సంస్థ జీతం ఇచ్చేది కాదని, తెలంగాణ ఉద్యమ సమయంలో 35 రోజుల పాటు సాగిన సకల జనుల సమ్మెలో పాల్గొన్న వారికి రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ పూర్తి జీతం ఇచ్చారని ప్రస్తావించారు.
Read Also: Vamshi Krishna: వైఎస్ లానే రేవంత్ పాలన ఉంటుంది.. నేను కూడా మంత్రి పదవి ఆశిస్తున్నా..
కార్మికుల తల్లిదండ్రులకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్య సౌకర్యం కల్పించడం, క్వార్టర్స్ లో నివసించే వారు బేసిక్ లో 1 శాతం సంస్థకు చెల్లించాలన్న నిబంధనను కేసీఆర్ రద్దు చేశారని, డిపెండెంట్ ఉద్యోగం వద్దనుకుంటే ఆ కుటుంబానికి రూ. 25 లక్షలు చెల్లించాలన్న నిర్ణయం, కార్మికులు మెడికల్ అన్ ఫిట్ అయితే వేతన రక్షణ కల్పించడం, సొంత ఇల్లు నిర్మించుకునే వారికి రూ. 10 లక్షల వరకు సంస్థనే వడ్డీ భరించడం, ఐఐటీ, ఐఐఎం వంటి సంస్థల్లో చదువుకునే కార్మికుల పిల్లలకు ఫీజు రియంబర్స్ మెంట్ వంటి విప్లవాత్మకమైన కార్మిక సంక్షేమ నిర్ణయాలను కేసీఆర్ తీసుకున్నారని కవిత వివరించారు.
తాజావార్తలు
-
KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
-
Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
-
Cyber Fraud: తెలుగు అమ్మాయిలతో సైబర్ వల.. ఢిల్లీ ముఠా దందా బట్టబయలు
-
Kalki 2 Casting Call: డార్లింగ్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కావాలా? ‘కల్కి 2’ కోసం మేకర్స్ బంపర్ ఆఫర్!
-
Ranabaali: రణబాలి రిలీజ్‌పై బిగ్ అప్డేట్! విజయ్ దేవరకొండ-రష్మిక సినిమా కొత్త డేట్ ఇదేనా?
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!