Vijay Deverakonda: ‘రణబాలి’లో హింస ఎక్కువే.. కానీ ఆనాటి వాస్తవాలతో పోలిస్తే తక్కువే:
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘రణబాలి’ సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరో విజయ్ దేవరకొండ ట్రైలర్లో హింస (Violence) ఎక్కువగా ఉందన్న విలేకరుల ప్రశ్నలపై విజయ్ దేవరకొండ స్పష్టతనిచ్చారు. ఇది కల్పిత హింస కాదని, ఆనాటి మొరటు కాలపు జీవన వాస్తవికతను ప్రతిబింబించే ప్రయత్నమని తెలిపారు.
“1800ల నాటి కాలంలో జీవించడం అంటేనే చావో-బ్రతుకో అన్నట్టు ఉండేది. ఏ చిన్న గొడవైనా ప్రాణాల మీదకే వచ్చేది. ఆ కాలంలో మనుషులు అంత క్రూరంగా, మొరటుగా ప్రవర్తించేవారు. చరిత్రలో ఆకలి తట్టుకోలేక ప్రజలు నల్లమట్టి, చెట్ల బెరళ్ళు, చీమల పుట్టల్లోని గింజలను తిన్న పరిస్థితులు ఉన్నాయి. చివరకు మనుషులను చంపి తినే స్థాయికి (Cannibalism) కూడా వెళ్లారు.
అలాంటి తీవ్రమైన వాస్తవాలతో పోలిస్తే, సినిమాలో మేము చూపించింది చాలా తక్కువే” అని విజయ్ వివరించారు. కేవలం వినోదం కోసమే కాకుండా, మన పూర్వీకులు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారో సహజంగా చూపించడానికే ఈ సినిమాలో రా అండ్ రస్టిక్ యాక్షన్‌ను చూపించినట్లు వెల్లడించారు. విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ “రణబాలి”. ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై “రణబాలి” సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ నెల 16న విజయదశమి పర్వదినం సందర్భంగా “రణబాలి” సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
Also Read
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
- Alias Rukmini Heroine: 'అలియాస్ రుక్మిణీ'.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
- Ranabaali Trailer: 'రణబాలి' ట్రైలర్‌పై మంత్రి లోకేష్ రివ్యూ!
తాజావార్తలు
-
Vijay Deverakonda: ‘రణబాలి’లో హింస ఎక్కువే.. కానీ ఆనాటి వాస్తవాలతో పోలిస్తే తక్కువే:
-
Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!
-
Vijay Deverakonda: “బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!”.. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
-
Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
-
CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!