MLC Kavitha : సింగరేణి సంస్థను కాపాడుతున్న గొప్ప నాయకులు కేసీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సింగరేణి సంబరాలు జరుపుకుంటున్న సింగరేణి బొగ్గు గని కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సింగరేణి కార్మికులకు ఇంక్రిమెంట్లతో పాటు, చిరకాల వాంఛ అయిన డిపెండెంట్ ఉద్యోగాలను సైతం సాధించుకున్నామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. డిపెండెంట్ ఉద్యోగాలు రాకుండా అనేక వ్యక్తులు, శక్తులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, సీఎం కేసీఆర్ గారు కార్మికుల మంచికోరే వ్యక్తిగా కారుణ్య నియామ ప్రక్రియ ద్వారా ప్రతినెలా ఉద్యోగులను తీసుకుంటున్నారన్న ఎమ్మెల్సీ కవిత, ఇప్పటిదాక దాదాపు 15 వేల వారసత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందన్నారు. వారసత్వ ఉద్యోగాలు కేవలం పురుషులకే కాకుండా, కూతుర్లు, కోడళ్లకు సైతం అవకాశం ఇవ్వడం ద్వారా మహిళల పట్ల కేసీఆర్ కు ఉన్న గొప్ప మనసును తెలియజేస్తోందన్నారు ఎమ్మెల్సీ కవిత. కారుణ్య ఉద్యోగం వద్దనుకున్న వారికి గతంలో ఇస్తున్న రూ.10 లక్షలను , తెలంగాణ రాష్ట్రం వచ్చాక రూ.25 లక్షలకు పెంచామని ఎమ్మెల్సీ కవిత గుర్తుచేశారు.
Also Read : Bhatti Vikramarka : కేసీఆర్ మాట్లాడిన మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయి
Also Read
- Pakistan: "మక్కా ఒప్పందం అండగా లేదు".. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
- Trump-Jinping: సెప్టెంబర్ 24న వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో జిన్‌పింగ్ భేటీ.. కీలక అజెండా ఇదేనా?
- SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. 'మిస్టర్ 360' అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
ఉద్యోగ విరమణ వయస్సును కూడా 61 సంవత్సరాలకు పెంచుకోవడం సంతోషకరమన్నారు ఎమ్మెల్సీ కవిత. కార్మికులకు సౌకర్యవంతంగా పనిచేయాలనే ఉద్దేశ్యంతో సింగరేణి క్వార్టర్స్ కు ఉచిత విద్యుత్ తో పాటు, ఏసీ ఏర్పాటు చేసుకునే సౌకర్యాలు కల్పించడం, ఇంటికి పది లక్షల రూపాయల వరకు వడ్డీలేని రుణాన్ని ఇవ్వడం, మహిళా కార్మికులకు రెండు సంవత్సరాల చైల్డ్ కేర్ లీవ్, దివ్యాంగులకు ఉద్యోగాలు, సింగరేణి ఏరియా ఆస్పత్రులలో తల్లిదండ్రులకు ఉచిత వైద్య సదుపాయాన్ని కల్పించడం, ఉద్యోగ విరమణ తర్వాత కూడా వైద్య సదుపాయాలు అందించడం, సింగరేణి కార్మికుల పిల్లల ఐఐటీ, ఐఐఎం లాంటి చదువులకు ఫీ రీయింబర్స్ మెంట్ ఇవ్వడం, సింగరేణి కార్మికుల కోసం మెడికల్ కాలేజీ లాంటి అనేక గొప్ప కార్యక్రమాలు తెలంగాణ వచ్చాక సాధించుకున్నామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజుతో పాటు, మరో రోజున వేతనంతో కూడిన అధికారిక సెలవుగా ప్రకటించి సీఎం కేసీఆర్ గారు అంబేద్కర్ పట్ల ఉన్న గొప్ప ప్రేమను మరోసారి చాటుకున్నారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. అమ్మ లాంటి సింగరేణి సంస్థను సీఎం కేసీఆర్ గారు కాపాడి, విస్తరించి, ఇతర రాష్ట్రాలకు సైతం సోలార్, థర్మల్ పవర్ ప్లాంట్ లను అధనంగా పెట్టి వేలాది మందికి ఉద్యోగాలు ఇవ్వడం, సంస్థను లాభాల బాట పట్టించడం తెలంగాణ రాష్ట్రం రావడం వల్లనే, తెలంగాణ బిడ్డ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండటం వల్లనే సాధ్యమయ్యాయని గర్వంగా చెబుతున్నానన్నారు ఎమ్మెల్సీ కవిత.
తాజావార్తలు
-
Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
-
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
-
Trump-Jinping: సెప్టెంబర్ 24న వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో జిన్‌పింగ్ భేటీ.. కీలక అజెండా ఇదేనా?
-
SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. ‘మిస్టర్ 360’ అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
-
Asia Cup Trophy Row: అది ప్లేయర్స్ నిర్ణయం కాదు.. బీసీసీఐది!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!